Budget 2022: ఏది చవకైనది? ఏది ఖరీదైనది?
Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో 2022-22 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా మారబోతున్నాయి.
Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (ఫిబ్రవరి 1) లోక్‌సభలో 2022-22 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించామని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గడియల్లో ఉన్నామని, మరో 25 ఏళ్ల విజన్‌తో తమ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని, రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌తో పునాది వేశామని అన్నారు.
కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని, కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిజిటల్ఇండియాలో భాగంగా.. డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నామన్నారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్‌తో 16 సెక్టార్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ట్యాక్సీలు తగ్గిస్తున్నట్టు తెలిపారు. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5%కి తగ్గించబడింది, కాలక్రమేణా 350 కంటే ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులను దశలవారీగా ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి సీతారామన్ చెప్పారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. భారత్ లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే..
చౌకగా లభించేవి
- బట్టలు
- రత్నాలు, వజ్రాలు
- అనుకరణ ఆభరణాలు
- మొబైల్ ఫోన్లు
- మొబైల్ ఫోన్ ఛార్జర్లు
- పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- స్టీల్ స్క్రాప్‌పై రాయితీ కస్టమ్స్ సుంకాన్ని 1 సంవత్సరం పొడిగించారు
ఖరీదుగా మారే వస్తువులివే...
- అన్ని దిగుమతి వస్తువులు
- గొడుగులపై సుంకం పెరిగింది
- క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు