Budget 2022: వ‌చ్చే ఐదేండ్ల‌లో 60 లక్షల ఉద్యోగాల కల్పన: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Budget 2022: వ‌చ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పించడమే ప్రభుత్వ తదుపరి లక్ష్యం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధిరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపొందించామని పేర్కొన్నారు.
 

Budget 2022: Creation of 60 lakh jobs next target of govt, says FM Nirmala Sitharaman

Budget 2022:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కార్ పదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. రాష్ట్ర పతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ వివరాలు తెలిపారు. అనంత‌రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. బడ్జెట్ 2022 ప్రసంగాన్ని ప్రారంభించారు. 
 
కరోనా మ‌హమ్మారి సంక్షోభ సమయంలోనూ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని, మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జ‌రుగుతున్న త‌రుణంలో ప్ర‌వేశ‌పెడుతున్న బ‌డ్జెట్ కాబ‌ట్టి.. బడ్జెట్ విషయంలో  ఉత్పాదక రంగం, సేవలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన‌ట్టు క‌నిపించింది. 

 వ‌చ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పించడమే ప్రభుత్వ తదుపరి లక్ష్యం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధిరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపొందించామని పేర్కొన్నారు.  పిఎం గతి శక్తి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుందనీ, యువతకు మరిన్ని ఉద్యోగఅవకాశాలకు దారి తీస్తుందనిఅన్నారు. దేశంలో యువత, మహిళలు, పేదలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె అన్నారు.  ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించ‌డానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌కు చాలా మంచి స్పందన  వ‌స్తుంద‌నీ, వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తిని సృష్టించే అవకాశం ఉందని చెప్పారు.

ప్ర‌భుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని తెలిపారు.  పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని, యువ‌త‌కు ఉ‍ద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.  మన దేశ జిడిపి వృద్ధి 2021-22లో, ఆ ముందేడాదితో పోల్చినప్పుడు 9.2 శాతం ఉంటుంది. ఐతే గత సంవత్సరం కరోనా మహమ్మారి ప్రభావం వలన దేశ ఆర్థిక వృద్ధి లేకపోగా 7.3 శాతం కుంచించుకుపోయిందని తెలిపారు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios