న్యూఢిల్లీ: దిగుమతి చేసుకొనే విదేశీ పుట్‌వేర్, ఫర్నీచర్‌పై కస్టమ్స్ డ్యూటీని పెంచుతున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

శనివారంనాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. విదేశాల నుండి దిగుమతి చేసుకొనే చెప్పులు, ఫర్నీచర్‌పై కస్టమ్స్ డ్యూటీని పెంచుతున్నట్టుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. మరో వైపు  హెల్త్ సెస్‌ను కేంద్ర ప్రభుత్వం విధించింది.

విదేశాల నుండి దిగుమతి చేసుకొనే మెడికల్ పరికరాలపై కేంద్రం ఈ సెస్‌ను విధించినట్టుగా కేంద్రం ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా రెండో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.