న్యూఢిల్లీ: కేంద్ర  ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు.శనివారంనాడు పార్లమెంట్‌లో  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై  కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.

ఈ బడ్జెట్‌తో పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదన్నారు. నిరుద్యోగులకు  ఈ బడ్జెట్‌ నిరాశే మిగిల్చిందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అతి పెద్ద బడ్జెట్ ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోతోందని  రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 

మాటలు తప్ప ఎలాంటి చేతలను కేంద్రం  చేయడం లేదని ఈ బడ్జెట్ మరోసారి నిరూపించిందని రాహుల్ గాంధీ విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉండదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.