ఈజిప్టులో పురాతన బుద్ధ విగ్రహం ఒకటి లభ్యమైంది. ఈ విగ్రహం అనేక ప్రాచీన రహస్యాల గుట్టు విప్పుతున్నది. ఈ విగ్రహం రోమన్ సామ్రాజ్య కాలంనాటిదని తేలింది. దీంతో రోమన్ సామ్రాజ్య కాలంనాటి ఈజిప్టుకు, ప్రాచీన భారతానికి మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు వచ్చాయి. 

న్యూఢిల్లీ: ఈజిప్టులో పురాతన బుద్ధ విగ్రహం బయటపడింది. ఈ విగ్రహంతో మరెన్నో రహస్యాల గుట్టు వీడుతున్నది. ఈ విగ్రహం రోమన్ సామ్రాజ్య కాలం నాటిదని గుర్తించారు. దీంతో రోమన్ సామ్రాజ్య కాలంలో అక్కడి ప్రాంతానికి, భారత దేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయనే వాదనలు బలంగా వస్తున్నాయి. 

ఎర్ర సముుద్రాన్ని అనుకుని బెరెనిస్ అనే ఈజిప్ట నగరం ఉన్నది. ఈ నగరంలో చరిత్రలో ప్రసిద్ధ ఓడరేవు ఉండేది. ఈ ఓడరేవు నగరంలోనే బుద్ధుడి విగ్రహం లభించింది. ఈ విగ్రహం రోమన్ సామ్రాజ్య కాలం నాటిదని ఒక పోలాండ్, అమెరికా మిషన్ కొనుగొన్నట్టు ఈజిప్టు యాంటిక్విటీస్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రోమన్ సామ్రాజ్య కాలంలో ప్రాచీన ఈజిప్టు, ప్రాచీన ఇండియాకు మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయనే ముఖ్యమైన సంకేతాలను ఈ బుద్ధుడి విగ్రహం ఇస్తున్నదని ఈజిప్టు సుప్రీం యాంటిక్విటీస్ కౌన్సిల్ మొస్తఫా అల్ వజీరి తెలిపారు.

ఆ విగ్రహం దానికి కుడి భాగాన్ని దాదాపు కోల్పోయి ఉన్నది. కుడి చేయి, కుడి కాలు లేదు. 71 సెంటిమీటర్లు (28 ఇంచులు) ఎత్తు ఈ విగ్రహం ఉన్నది.

రోమన్ సామ్రాజ్య కాలం నాటి ఈజిప్టులో బెరెనిస్ అనేది ప్రసిద్ధ ఓడరేవు పట్టణం. ఇండియా నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు, సెమీ ప్రీషియస్ స్టోన్లు, టెక్స్‌టైల్, ఐవరీలు ఈ ఓడరేవుకే చేరేవని ఊహిస్తున్నారు. 

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

ఈజిప్టు అనేక పురాతన ఆవిష్కరణలు చేస్తున్నది. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలనే లక్ష్యం దీని వెనుక ఉన్నట్టు తెలుస్తున్నది. రాజకీయ సంక్షోభం, కరోనా మహమ్మారితో పర్యాటక రంగం కుదేలైంది. మళ్లీ ఈ రంగం పుంజుకోవాలని ఈజిప్టులో పురాతన విషయాలపై అధ్యయనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే, ఈ తవ్వకాలు ప్రధానంగా అకడమిక్ రీసెర్చ్ కంటే కూడా మీడియా దృష్టిని ఆకర్షించేలానే ఉన్నాయని విమర్శకులు చెబుతున్నారు. ఈజిప్టులోని గిజా పిరమిడ్ల వద్ద పెద్ద మ్యూజియం నిర్మాణం వేగంగా పూర్తి చేయాలనీ ఆ దేశం భావిస్తున్నది.