Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారు...కాంగ్రెస్‌‌‌తో పొత్తుపై స్ఫష్టత ఇచ్చిన మాయావతి

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని నిర్దేశించే ఉత్తర ప్రదేశ్‌లో  రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు మరోసారి అధికారం దక్కకుండా చేసేందుకు బిఎస్పి(బహుజన్ సమాజ్ వాది పార్టీ), ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) లు ఒక్కటయ్యాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో యూపితో పాటు తమకు బలమున్న ఇతర రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని మాయావతి వెల్లడించారు. 

BSP, SP formally announce alliance
Author
Uttar Pradesh, First Published Jan 12, 2019, 1:03 PM IST

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని నిర్దేశించే ఉత్తర ప్రదేశ్‌లో  రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు మరోసారి అధికారం దక్కకుండా చేసేందుకు బిఎస్పి(బహుజన్ సమాజ్ వాది పార్టీ), ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) లు ఒక్కటయ్యాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో యూపితో పాటు తమకు బలమున్న ఇతర రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని మాయావతి వెల్లడించారు. 

యూపీలో కాంగ్రెస్ కు బలం లేదు కాబట్టి వారితో కలిసి పనిచేసేందుకు తాము సిద్దపడలేదని మాయవతి  అన్నారు. అంతే కాకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ ఓట్లు తమకు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీఎస్పీ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నష్టపోయిందని మాయావతి తెలిపారు. 

 గత నాలుగున్నరేళ్ల బిజెపి ప్రభుత్వ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగిత, అరాచకాలు పెరిగాయని మాయావతి విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల పాలన వల్లే దేశం ఈ పరిస్థితుల్లో వుందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి కారణంగానే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారాన్ని  కోల్పోయిందని అన్నారు. తాజాగా రాఫెల్ వంటి అవినీతి ఒప్పందాలతో దేశంలోని ప్రజాధనాన్ని లూటీ చేసిన బిజెపి కూడా అలాగే అధికారాన్ని కోల్పోవడం ఖాయమని మాయావతి ధీమా  వ్యక్తం చేశారు.  

ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి ఎమర్జెన్సీ కాలాన్ని తలపిస్తోందని మాయావతి అన్నారు. అందువల్ల వారిని ఎదుర్కోడానికి ఎస్పీ, బీఎస్పీలు కలిసి పనిచేస్తున్నాయని... ఇక నుండి మోదీ, అమిత్ షాలకు నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందన్నారు. 

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం లేదని మాయావతి పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల్లో కూడా పొత్తు ఉండదన్నారు. కేంద్రంలో మరోసారి బిజెపి  ప్రభుత్వం రాకుండా ఉత్తర  ప్రదేశ్ నుండే అడ్డుకుంటామని అన్నారు. గతంలో మాదిరిగా ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని మాయావతి అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ నెల 4 వ తేదీన డిల్లీలో ఇరు పార్టీల నాయకులు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు మాయావతి వెల్లడించారు. మొత్తంగా యూపీలోని 80 లోక్ సభ స్ధానాల్లో 38 చోట్ల బీఎస్పీకి, 38 సీట్లలో ఎస్పీ పోటీ చేస్తుందన్నారు. అలాగే అమేథీ, రాయ్ బరేలీలో పోటీ వుండదని వెల్లడించారు. బిజెపి పార్టీని దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios