Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో పాకిస్థాన్ డ్రోన్‌ కూల్చివేత.. భారీ మొత్తంలో హెరాయిన్ స్వాధీనం..

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ పట్టుబడింది. ఆదివారం గురుదాస్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఓ డ్రోన్‌ గుర్తించారు. దాని వద్ద భారీసైజులో పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నారు

BSF recovers drone, suspected drugs from border areas in Punjab's Gurdaspur
Author
First Published Feb 20, 2023, 4:43 AM IST

పాకిస్థానీ డ్రోన్‌: మరోసారి పంజాబ్ లో డ్రోన్ కలకలం చేలారేగింది. పంజాబ్ యువతను చెడగొట్టేందుకు పాకిస్థాన్ నుంచి రహస్యంగా డ్రగ్స్, ఆయుధాలు రవాణా జరుగుతోంది. ఇందుకోసం ఇప్పుడు డ్రోన్ల సపోర్టు తీసుకున్నారు. అయితే , సరిహద్దుల్లోని భారత సైనికులు తరచూ ఈ కుట్రలను తిప్పికొడుతున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 19) పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చడంలో  BSF విజయం సాధించింది. సెర్చ్ ఆపరేషన్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు  డ్రోన్‌తో పాటు 4 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ బరువు 2.730 కిలోలు. డ్రోన్ పాకిస్థాన్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. ఈ ఘటన గురుదాస్‌పూర్ సరిహద్దులోని ఘనీకే బీఓపీలో చోటుచేసుకుంది.

వరుసగా రెండు రోజుల్లో  

వాస్తవానికి, శనివారం (ఫిబ్రవరి 18) రాత్రి  అదే బెటాలియన్ పాకిస్తాన్ స్మగ్లర్లపై కాల్పులు జరపగా, 20 హెరాయిన్ ప్యాకెట్లు, రెండు పిస్టల్స్, మ్యాగజైన్లు , మరియు బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. బీఎస్‌ఎఫ్ జవాన్లు రెండు రోజుల్లో పాక్ చేసిన రెండు భారీ ప్రణాళికలను విఫలం చేశారని బీఎస్‌ఎఫ్ డీఐజీ ప్రభాకర్ జోషి తెలిపారు. ఉదయం 5:30 గంటలకు దట్టమైన పొగమంచులో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు.. BSF కానిస్టేబుల్ హేమ్రామ్ కొన్ని అనుమానాస్పద కదలికలను గమనించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ వైపు నుండి కాల్పులు ప్రారంభించారు. దీంతో మన జవాన్లు కూడా తిరిగి కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

డ్రోన్ల ద్వారా పాక్ అక్రమ రవాణా 

నెల రోజుల క్రితం పంజాబ్ పోలీసులు పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేశారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. కూల్చబడ్డ డ్రోన్ లో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  సంఘటన జరిగిన వెంటనే, పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పాడైపోయిన డ్రోన్ మరియు ఐదు కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ పర్వేష్ చోప్రా తెలిపారు. పాకిస్థాన్ నుంచి భారత భూభాగానికి డ్రోన్ ఎన్నిసార్లు వెళ్లిందనేది గూగుల్ మ్యాప్ ద్వారా నిర్ధారించబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios