Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్‌లో మరో దారుణం.. సూపర్ మార్కెట్‌లో మహిళపై లైంగిక.. వీడియో వైరల్

హింసాత్మకమైన మణిపూర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూపర్ మార్కెట్ లో ఓ యువతిపై సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుల్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటపడటంతో ఆ కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

BSF jawan gropes woman in grocery store, suspended in Manipur KRJ
Author
First Published Jul 26, 2023, 7:53 AM IST

గత కొన్ని రోజులుగా అల్లర్లు, హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్న మణిపూర్ లో రోజుకో దారుణ ఉదంతం వెలుగులోకి వస్తోంది. గతవారం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై యావాత్తు దేశం దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. అటు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ఇలా రోజుకో దారుణ ఘటన బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా 
తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. 

సూపర్ మార్కెట్ సరుకులు కొంటున్న ఓ మహిళను ఓ బీఎస్ఎఫ్ జవాన్  లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అమానుష ఘటన జూలై 20న ఇంఫాల్ లో ఓ సూపర్ మార్కెట్ లో జరిగినట్టు తెలుస్తోంది. నిందితుడిని బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ ప్రసాద్‌గా గుర్తించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితుడిని సస్పెండ్ చేసిన బీఎస్ఎఫ్, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?

వైరలవుతున్న వీడియోలో యూనిఫాం ధరించిన జవాన్ ఓ మహిళను బలవంతంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. జవాన్ వద్ద రైఫిల్ కూడా ఉంది. అతడు ఆ మహిళను పదేపదే తాకడం.. ఆ భయంతో నిరాకరించడం చూడవచ్చు.  ఆ వ్యక్తి ఆ మహిళపై ఎక్కడపడితే.. అక్కడ చేతులేయడం చూడవచ్చు. ఈ దారుణం అంత అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు ఈ చర్యను సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే అతడిని సస్పెండ్ చేశారు. సతీశ్ ప్రసాద్ బీఎస్ఎఫ్ 100 బెటాలియన్ కు చెందిన పోలీస్. భద్రతా విధుల కోసం ఇటీవల అడ్ హక్ యూనిట్ ను మణిపూర్ కు పంపారు. అందులో జవాను సతీశ్ ప్రసాద్ కూడా ఉన్నాడు.

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు..

జూలై 19న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో #మణిపూర్ హింసతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. ఓ పొలంలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) ఆరోపించింది. ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ఇంటర్నెట్ బ్యాన్ కారణంగా.. ఈ వీడియో అప్పుడు బయటకు రాలేకపోయింది. ఇద్దరు కాదు ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు జూలై 20న తెలిసింది. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. 

21 ఏళ్ల సామూహిక అత్యాచార బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. 'మేము పోలీసు కారులో ఉన్నాము. పోలీసులు మనల్ని కాపాడతాడని అనుకున్నాను. కానీ, మెయిటీ అబ్బాయిల గుంపు కారును చుట్టుముట్టింది. మమ్మల్ని కారులో నుంచి బయటకు లాగి .. అక్కడక్కడా తాకడం మొదలుపెట్టారు. మీరు జీవించి ఉండాలనుకుంటే.. మీ బట్టలు విప్పండి. మేము సహాయం కోసం పోలీసుల వైపు చూశాము, వారు వెనుదిరిగారు. అప్పుడు మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికి మా బట్టలు తీసేసాము....'. బాధితురాలు ఇంకా గాయంలోనే ఉంది.

మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో.. వీడియో చూసి చాలా బాధపడ్డామని సుప్రీంకోర్టు పేర్కొంది. చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.  మత ఘర్షణల సమయంలో మహిళలను సాధనంగా ఉపయోగించుకోవడాన్ని ఎప్పటికీ అంగీకరించలేమని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇది  అత్యంత హేయమైన అవమాన ఘటన పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 28న జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios