ఇంట్లో మద్యం సేవించవద్దన్న భార్యపై కాల్పులు జరిపాడు బీఎస్ఎఫ్ జవాను. మహారాష్ట్ర పుణెలోని తాడివాలా ప్రాంతానికి చెందిన బాలాజీ రంగనాథ్ బీఎస్ఎఫ్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు.
ఇంట్లో మద్యం సేవించవద్దన్న భార్యపై కాల్పులు జరిపాడు బీఎస్ఎఫ్ జవాను. మహారాష్ట్ర పుణెలోని తాడివాలా ప్రాంతానికి చెందిన బాలాజీ రంగనాథ్ బీఎస్ఎఫ్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇతనికి భార్య కడుబాయి, కుమారుడు యోగేశ్ ఉన్నారు.
ఎప్పటి నుంచో మద్యం తాగే అలవాటున్న రంగనాథ్...ప్రతిరోజు మందు తాగి అర్థరాత్రిపూట ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి ఒంటిగంటకు పీకలదాకా తాగి ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీశాకా ఇంట్లోకి ప్రవేశించిన రంగనాథ్ అక్కడ మళ్లీ బాటిల్ ఓపెన్ చేశాడు.
ఇప్పటికే బాగా తాగి ఉన్నారు.. ఇంట్లో కూడా ఎందుకు, తాగొద్దు అని ఆమె ప్రాధేయపడింది. అప్పటికే మద్యం మత్తు తలకెక్కి ఉండటంతో విచక్షణ కోల్పోయిన రంగనాథ్... భార్య మాటలకు ఆగ్రహం వ్యక్తం చేశాడు.. వెంటనే తన రివాల్వర్ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు.
అయితే బుల్లెట్ ఆమె పక్క నుంచి దూసుకుపోవడంతో కడుబాయికి ప్రాణాపాయం తప్పింది. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగనాథ్‌ను అదుపులోకి తీసుకుని.. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
