Asianet News TeluguAsianet News Telugu

భారత్ - పాక్ సరిహద్దుల్లో భారీ సొరంగం.. కొద్దిదూరంలోనే పాకిస్తాన్ సైనిక పోస్ట్

జమ్మూకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో ఓ సొరంగ మార్గాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. ఆ సొరంగ మార్గంలో ఇసుకు సంచులను స్వాధీనం చేసుకున్నాయి

bsf found 20-Metre Tunnel In indo pak border in Jammu
Author
Jammu, First Published Aug 29, 2020, 6:42 PM IST

జమ్మూకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో ఓ సొరంగ మార్గాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. ఆ సొరంగ మార్గంలో ఇసుకు సంచులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిపై పాకిస్తాన్‌కు చెందిన గుర్తులు కనిపించినపట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన నేపథ్యంలో సరిహద్దుల్లో ఇలాంటి సొరంగాలు ఇంకా ఎన్ని ఉన్నాయో కనుగొనేందుకు భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. సొరంగం గుర్తించిన నేపథ్యంలో ఇకపై చొరబాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని కమాండర్లను బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్థానా ఆదేశించారు.

కాగా పంజాబ్‌లో ఇటీవల ఐదుగురు సాయుధులైన చొరబాటుదారులను బీఎస్ఎఫ్ కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సరిహద్దుల్లో మెగా డ్రైవ్‌ను చేపట్టింది.

దీనిలో భాగంగా జమ్మూలోని సాంబా సెక్టార్ పరిధిలో పెట్రోల్ చేస్తుండగా బీఎస్ఎఫ్ దళాలు ఈ సొరంగాన్ని గుర్తించాయి. భారత్ వైపు 50 మీటర్లు వరకు ఉన్న ఈ సొరంగ మార్గం 25 మీటర్ల లోతు వుంది. అందులో 8 నుంచి 10 ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కరాచీ అని రాసివుంది.

ఈ సొరంగానికి 400 మీటర్ల దూరంలో పాకిస్తాన్ సరిహద్దు పోస్ట్ ఉంది. ఇలాంటి సొరంగ మార్గాల ద్వారా ఆక్రమంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు ఆక్రమ రవాణా చేసే అవకాశం వుండటంతో వీటిని గుర్తించేందుకు బీఎస్ఎఫ్ ఆపరేషన్ చేపట్టింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios