తనింట్లో ఉన్న పెంపుడుకుక్క, ఐదు కుక్కపిల్లలు... తన ఇంటి బేస్మెంట్ కింద ఉండగా మండుతున్న కర్రతో వాటికి నిప్పుపెట్టింది. విషయాన్ని గమనించిన స్థానికులు దీన్నంతా వీడియో తీశారు. వెంటనే జంతు హక్కుల కార్యకర్తలకు తెలిపారు. 

కేరళలో క్రూరమైన హింస జరిగింది. మూగజీవాలన్న కనీస దయ మరిచి ఓ మహిళ అతి భయంకరమైన చర్యకు దిగింది. తనింట్లో ఉన్న కుక్కలకు నిప్పంటించింది. కేరళలోని మాంజలి అనే చిన్న గ్రామంలో జరిగిన ఈ చర్య జంతుప్రేమికుల్ని షాక్ కు గురిచేసింది. 

తనింట్లో ఉన్న పెంపుడుకుక్క, ఐదు కుక్కపిల్లలు... తన ఇంటి బేస్మెంట్ కింద ఉండగా మండుతున్న కర్రతో వాటికి నిప్పుపెట్టింది. విషయాన్ని గమనించిన స్థానికులు దీన్నంతా వీడియో తీశారు. వెంటనే జంతు హక్కుల కార్యకర్తలకు తెలిపారు. 

హుటాహుటిన అక్కడికి చేరుకున్న కార్యకర్తలు మంటలను ఆపి, కుక్క, కుక్క పిల్లలను కాపాడారు. ఒక్క కుక్కపిల్ల మాత్రమే గాయాలబారిన పడిందని, మిగతా అన్నీ సురక్షితంగా ఉన్నాయని వారు తెలిపారు. ఆమె ఇలా జంతు హింసకు పాల్పడడానికి గత కారణం తెలియరాలేదు. ఆమెపై జంతు హింస కింద కేసు నమోదైంది.