ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఆఫీసర్ ను దుండగులు కారుతో గుద్ది చంపారు. ఆయన 23 సంవత్సరాల కిందట పదవీ విరమణప పొందారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ ఆఫీసర్ దారుణ హత్యకు గురయ్యారు. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఆయనపై ఓ కారును ఎక్కించి హత్య చేశారు. దీనిని తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించిన అనంతరం ఇది ఉద్దేశ పూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిందని అర్థం అయ్యింది.
అమానుషం.. జామపండు దొంగిలించాడనే అనుమానంతో దళితుడిపై దాడి, హత్య..
వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆర్‌కె కులకర్ణి (82) ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా పని చేసి 23 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడు. అయితే ఎప్పటిలాగే మైసూరు విశ్వవిద్యాలయంలోని మానసగంగోత్రి క్యాంపస్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో ఆయన కిందపడిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు.
దారుణం.. కుమారుడికి గుండె జబ్బు నయమవుతుందని.. కూతురు గొంతు నులిమి హత్య చేసిన తల్లి.. ఎక్కడంటే ?
మొదట్లో దీనిని హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు భావించారు. అయితే ఘటనా స్థలం దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీలో కారును కావాలనే కులకర్ణిపై ఎక్కించారని తెలిసింది. దీంతో పోలీసులు దీనిని హత్యగా భావించారు. అయితే ఫుటేజీల్లో ఆ కారుకు నెంబర్ ప్లేట్ ఉన్నట్టు కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై మైసూరు పోలీస్ కమిషనర్ చంద్రగుప్తా మాట్లాడుతూ.. నవంబర్ 4న సాయంత్రం 5.30 గంటలకు మానస గంగోత్రి వద్ద కారు ఢీకొని 82 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. ‘‘ మేము ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇది ప్రమాదం కాదు. హత్య నిర్ధారణకు వచ్చాము. దానికి అనుగుణంగా మేము మా దర్యాప్తును ప్రారంభించాము. దీనిపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహరాజు ఆధ్వర్యంలో మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశాం ’’ అని తెలిపారు. కారుకు నెంబర్ ప్లేట్ లేదని గుర్తించిన అనంతరం తమకు అనుమానం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద మరింత సమాచారం ఉందని, కానీ దానిని ఇప్పుడు వెల్లడించలేమని ఆయన చెప్పారు.
