Brothers Killed Sister: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని అతిక్రూరంగా చెల్లిని చంపిన సోదరులు
Brothers Killed Sister: ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించిదనే కారణంతో సొంత చెల్లిపై ఇద్దరు సోదరులు పదునైన ఆయుధాలతో అతిక్రూరంగా దాడి ప్రాణాలు తీశారు. తనపై దాడిచేయడానికి వస్తున్నారని తెలుసుకున్న ఆ ఆమె భయంతో దాక్కుంది. అయినా వదలకుండా వెతికిమరి దాడిచేసి చంపారు.

Chhatrapati Sambhajinagar: ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించిదనే కారణంతో సొంత చెల్లిపై ఇద్దరు సోదరులు పదునైన ఆయుధాలతో అతిక్రూరంగా దాడి ప్రాణాలు తీశారు. తనపై దాడిచేయడానికి వస్తున్నారని తెలుసుకున్న ఆ ఆమె భయంతో దాక్కుంది. అయినా వదలకుండా వెతికిమరి దాడిచేసి చంపారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని సోయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసముంటున్న మాయత్ చంద్రకళ అనే యువతి వేరే కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయం ఇంట్లో కూడా చెప్పింది. అయితే, వీరి ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమ విషయం గురించి మర్చిపోవాలని సూచించారు.
అయితే, సదరు యువతి తాను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కుదరదని చెప్పి.. ఇంట్లోని నుంచి వెళ్లిపోయింది. తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి అతని ఇంట్లోనే సహజీవనం చేస్తోంది. ఈ విషయంతో తెలిసిన యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యువతి సోదరులు ఆగ్రహంతో ఆమెను చంపెందుకు పదునైన ఆయుధాలతో వారు నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లారు. అయితే, విషయం తెలుసుకున్న ఆ యువతి.. ఒకవ్యక్తి సాయంతో మేకలను ఉంచిన స్థలంలో దాక్కుంది.
అయినా వదలకుండా ఆ యువతిని కోసం వెతుకుతూ.. దాక్కున్న ప్రాంతం గుర్తించి ఆయుధాలతో దాడి చేశారు. శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో యువతి రక్తపు మడుగులో పడిపోయింది. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలాగే, ఆ యువతి దాక్కొవడానికి సహాయం అందించిన వ్యక్తిపై కూడా వారు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడి గురించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడి చేరుకుని కేసు నమోదుచేసుకున్నారు. పదునైన ఆయుధాలతో యువతిపై దాడి చేసి ప్రాణాలు తీసిన ఇద్దరు సోదరులతో పాటు వారి తల్లిదండ్రులపై కేసు నమోదుచేసి, అదుపులోకి తీసుకున్నారు.