ఒకే తల్లి రక్తం పంచుకుపుట్టిన చెల్లెలి పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు ఓ అన్న. సంవత్సరం పాటు.. లైంగికంగా చెల్లెలిని వేధించి.. ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ సంఘటన కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్ కి చెందిన ఓ యువకుడు డిప్లమా చేస్తున్నాడు. కాగా.. అతనికి ఒక చెల్లెలు ఉంది. ఆమె స్థానిక కార్పొరేషన్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. కాగా.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసుకొని ఆ యువకుడు తోడబుట్టిన చెల్లిని లైంగికంగా వేధించాడు. దాదాపు సంవత్సరంపాటు.. మైనర్ బాలిక తో లైంగిక చర్యలో పాల్గొన్నాడు.

ఇటీవల.. బాలిక గర్భం దాల్చింది. విషయం గమనించిన యువకుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. అయితే.. బాలిక శరీరంలో మార్పులు గమనించిన స్కూల్ టీచర్లు.. ఆమెకు ఆస్పత్రిలో పరీక్షలు చేయగా... గర్భవతి అని తేలింది.

వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు బాలికను ప్రశ్నించగా.. తన అన్న చేసిన ఘాతుకాన్ని వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.