మైనర్ బాలికపై సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ కార్పొరేటర్ ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిదన రాజేంద్ర సింగ్ అలియాస్ కెండు బాబా.. స్థానిక కార్పొరేటర్ గా స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించాడు. కాగా... అతను గతంలో రాఖీ పండగ రోజు సామూహిక రాఖీ ఉత్సవాలు నిర్వహించి వెయ్యి మంది బాలికలతో రాఖీ కట్టించుకున్నాడు. తనని తాను వెయ్యి మంది చెల్లెల్లకు అన్నయ్యగా పిలిపించుకుంటాడు. అయితే... పైకి అందరి ముందు మంచిగా నటిస్తూనే.. వెనుక చాటు మాటు వ్యవహారాలు నడుపుతున్నాడని తాజాగా తెలిసింది.

11ఏళ్ల మైనర్ బాలికపై సంవత్సరం పాటుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వారి తల్లిదండ్రులు ధైర్యం చేయలేకపోయారు. అయితే... అతని ఆగడాలు మరింత శ్రుతిమించడంతో ధైర్యం చేసి పోలీసులకు లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా బాధిత కుటుంబాన్ని పోలీసులకు కలిశారు.

పోలీసుల అండతో... వారు రాజేంద్ర సింగ్ పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను బెదిరించి గత సంవత్సరంపాటుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాలిక తల్లి పేర్కొంది. అతని మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ ఏర్పాటు చేశారు.