Asianet News TeluguAsianet News Telugu

చెల్లిని గొంతునులిమి చంపి, వంటింట్లో గొయ్యితీసి పాతిపెట్టాడు.. అక్కడే పడుకుంటూ అన్న దారుణం...

చెల్లెలిని దారుణంగా హత్య చేశాడో అన్న. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని వంటింట్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆ తరువాత పక్కగదిలోనే పడుకున్నాడు. చివరికి... 

brother murder sister and buried in kitchen in uttarpradesh
Author
First Published Dec 28, 2022, 12:52 PM IST

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో తల్లిదండ్రులు లేని ఓ అన్నాచెల్లెళ్ల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరే ఉంటున్న అన్నాచెల్లెలు అన్యోన్యంగా ఉండాల్సింది పోయి…చెల్లెలి మీద దారుణానికి ఒడిగట్టాడు అన్న. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన చెల్లిని అత్యంత కర్కశంగా హతమార్చాడు. తన దారికి అడ్డువస్తుందని చెల్లెలిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ఇంట్లోని వంటగదిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. 

ఆ తర్వాత ఏమీ జరగనట్టు ఆ పక్క గదిలోనే నిద్రపోయేవాడు. అయితే, అమ్మాయి కనిపించక పోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. అంతేకాదు ఈ యువకుడి ప్రవర్తనలో రెండు రోజులుగా  తీవ్ర మార్పు వచ్చింది. దీంతో ఏదో జరిగి ఉంటుందని.. అనుమానించిన వారు  పోలీసులకు సమాచారం అందించారు. పక్కింటి వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. హిమాన్షు అనే యువకుడు లక్నోలోని సైర్ పూర్ ప్రాంతానికి చెందినవాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితం అతని తల్లిదండ్రులు మరణించారు. 

మధురై ఎయిర్‌పోర్ట్‌లో కరోనా కలవరం.. చైనా నుంచి తిరిగివచ్చిన తల్లీకూతుళ్లకు పాజిటివ్‌గా నిర్దారణ..

అతనికి ఒక సోదరి ఉంది. ఆమెపేరు శివాని.  తల్లిదండ్రుల మరణం తర్వాత సోదరితో కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు. అయితే హిమాన్షు చాలా రోజులుగా డ్రగ్స్ కు బానిస అయ్యాడు. ఆ మత్తులో రోజు ఇంటికి వచ్చి సోదరి శివానితో గొడవ పెట్టుకునేవాడు. అలాగే ఈ నెల 24వ తేదీన కూడా డ్రగ్స్ మత్తులో వచ్చిన హిమాన్షు సోదరితో గొడవ పడ్డాడు. ఆమెను కర్రతో చావ చితకొట్టాడు. అంతటితో అతని మత్తు దిగలేదు. సోదరి గొంతునులిమి చంపేశాడు. చేసిన దారుణం అర్థమైన తర్వాత ఆమె మృతదేహాన్ని కనిపించకుండా మాయం చేయాలనుకున్నాడు. వంట గదిలో రాత్రంతా  గొయ్యి తవ్వాడు. ఆ గోతిలో  సోదరి మృతదేహాన్ని వేసి పూడ్చిపెట్టాడు.

వంటగదికి ఆనుకున్ని ఉన్న గదిలోనే రోజూ నిద్రపోయేవాడు. అయితే తల్లిదండ్రులు లేని ఆ కుటుంబం మీద చుట్టుపక్కల వారికి కాస్త సానుభూతి ఉండేది. శివాని రెండు రోజులుగా కనిపించకపోవడంతో వారు అనుమానించారు. దీనికితోడు హిమాన్షు  ప్రవర్తనలో మార్పు రావడంతో..  గమనించిన వారు పోలీసులకు తెలిపారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. సోదరిని ఎందుకు చంపావు అని అడిగితే.. తన దారికి అడ్డు రావడం వల్లే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఒప్పుకున్నాడు. దీంతో హిమాన్షు మీద కేసు నమోదు చేశారు.  అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios