గోవాలో ఓ బ్రిటన్ దేశస్తురాలిపై స్థానికుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తర గోవాలోని ఓ బీచ్‌లో మహిళ రిలాక్స్ అవుతుండగా.. గోవాకు చెందిన జోయల్ విన్సెంట్ డిసౌజా అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడిని అరెస్టు చేశారు. 

పనాజీ: గోవా అంటే అందాల బీచ్‌లకు నెలవు. విదేశాల నుంచి చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి గోవాకు వస్తుంటారు. అందుకే గోవాలో ఎక్కువగా విదేశస్తులే కనిపిస్తుంటారు. గోవాలో స్థానికులు, మరీ ముఖ్యంగా కూలి పని చేసే వారు కూడా ఆంగ్లం సరళంగా మాట్లాడటమే అక్కడికి విదేశస్తుల తాకిడిని వెల్లడిస్తుంది. గోవా బీచ్‌లలో ఎప్పుడూ విదేశీయులు రిలాక్స్ అవుతున్న దృశ్యాలు సర్వసాధారణం. అయితే, ఓ దుండగుడు దీన్నే ఆసరాగా తీసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఉత్తర గోవాలో ప్రసిద్ధ స్వీట్ లేక్ సమీపంలోని ఆరంబోల్ బీచ్‌లో విదేశస్తురాలిపై అత్యాచారం జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళపై 32 ఏళ్ల దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. 

బ్రిటన్‌కు చెందిన ఆ మహిళ భర్తతో కలిసి గోవాకు వచ్చింది. గోవాలో వారు సరదాగా కాలం గడుపుతున్నారు. జూన్ 2వ తేదీన ఆమె ఆరంబోల్ బీచ్‌లో రిలాక్స్ అవుతుండగా.. గోవాకు చెందిన జోయల్ విన్సెంట్ డిసౌజా ఆమెపై కన్నేశాడు. భర్త లేనిది చూసి ఒంటరిగా ఉన్న ఆమెను రేప్ చేశాడు. 

ఈ అఘాయిత్యం గురించి ఆమె తన భర్తకు తెలిపింది. ఇద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు జోయల్ విన్సెంట్ డిసౌజాను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

కాగా, బిహార్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ దుండగుడు సోదరి స్నేహితురాలితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆమెతో శారీరక సంబంధాన్నీ పెట్టుకున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వంచించాడు. ఆమె గర్భం దాల్చింది. దీంతో మందులు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. ఆమె దానిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా ఆ డ్రింక్ తాగేసింది. ఆ తర్వాత ఆమెకు గర్భస్రావం అయింది. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెలలో ఈ దారుణ: చోటుచేసుకుంది.

సమస్తిపూర్‌ కు చెందిన ఓ దుండగుడు సిస్టర్ ఫ్రెండ్‌ను మోసం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత తరుచూ తనను పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయిని ఆమె ప్రాధేయపడింది. కానీ, ఆ దుండగుడు ఆమె విజ్ఞాపనలను పెడ చెవిన పెట్టాడు. పెళ్లి కోసం ఆమె ఎంతో ప్రయత్నించింది. చివరకు ఆమె తల్లిదండ్రులకూ విషయం చెప్పింది. తనతో సంబంధం పెట్టుకున్నవాడి వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పించాలని కూడా కోరింది. కానీ, ఆమె తల్లిదండ్రులు ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. 

పెళ్లి చేసుకుంటా అని నమ్మించిన ఓ దుండగుడు ఆ అమ్మాయిని ఓ క్లినిక్‌ లోకి తీసుకెళ్లాడు. అక్కడే అబార్షన్‌కు ఎత్తుగడ వేశాడు. డ్రింక్‌లో మందులు కలిపి చేతికి ఇచ్చాడు. ఆమె ఆ డ్రింక్ తాగేసింది. అనంతరం ఆమెకు గర్భస్రావం అయింది. అబార్షన్ తర్వాత ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెను ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.