Asianet News TeluguAsianet News Telugu

అత్తారిళ్లు దూరముందని.. వరుడికి షాక్ ఇచ్చిన నవ వధువు!

ఉత్తర‌ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వధు, వరులకు  వివాహం వైభవంగా జరిగింది. అప్పగింతలు పూర్తయ్యాయి... అత్తారింటికి వెళ్తున్న నవ వధువు మార్గంమధ్యలో వరుడికి వధువు ఊహించిన షాకిచ్చింది. అసలేం జరిగిందంటే..  

Bride left groom in the middle of the way due to long distance from Banaras to Bikaner lcln
Author
First Published Mar 19, 2023, 3:19 PM IST

ఉత్తర‌ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. వధు,వరుల అంగీకరంతో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వివాహం జరిగింది.  ఆచారాల ప్రకారం పెండ్లి కూతురు అప్పగింతలు పూర్తయ్యాయి. నవ వధువును తన అత్తారింటికి సాగనప్పారు. అంతా బాగానే ఉంది. కానీ.. సడెన్ గా  మార్గం మధ్యలో వరుడికి వధువు షాకిచ్చింది. తాను అత్తారింటికి రానంటూ ఏడుపు అందుకుంది. అసలేం జరుగుతుందో అర్థం కాక పెండ్లి కొడుకు తప్పుకున్నాడు. వరుడు కుటుంబ సభ్యులు కూడా ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.

ఇంతలోనే  అటుగా  పెట్రోలింగ్ కు  వచ్చిన పోలీసులు అసలేం జరిగిందో ఆరా తీశారు. ఆ నవ వధుడు ఏడ్వడానికి కారణం తెలుసుకుని కంగుతిన్నారు.  దీనికికారణం అత్తారిళ్లు దూరంగా ఉండటమే. వరుడు, అతని కుటుంబ సభ్యులు వధువుకు ఎంత నచ్చజెప్పినా.. వినకపోవటంతో పోలీసులు వధువును తిరిగి తమ స్వగ్రామానికి పంపించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాలు ఇలా ఉన్నాయి..  

యూపీలోని బనారస్ నివాసి వైష్ణవికి , రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతానికి చెందిన  వ్యక్తి రవితో వివాహం నిశ్చయమైంది. రవి తన పెళ్లి ఊరేగింపుతో గురువారం బికనీర్ నుండి వచ్చాడు. రవి, వైష్ణవిలకు బనారస్‌లో కోర్టు వివాహం చేసుకున్నారు.  అనంతరం అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. నవ వధువు అత్తారింటికి బయలుదేరింది. వరుడు, వరుడి కుటుంబ సభ్యులతో కలిసి ఇన్నావో కారులో  బికనీర్ కు ప్రయాణం సార్ట్ చేశారు.

దాదాపు ఏడు గంటల ప్రయాణం తరువాత.. కాన్పూర్‌లోని సర్సాల్ ప్రాంతానికి చేరుకున్నారు. అంటే... దాదాపు  400 కిలో మీటర్లు ప్రయాణించారు. ఇంకా 900 కిలో మీటర్ల ప్రయాణించాల్సి  ఉంది. ఈ విషయం తెలుసుకున్న వధువు ఆందోళన చెందింది. తన అత్తగారి ఇంటికి తన ఇంటికి ఇంతా దూరమా? అంటు భయపడింది. దీంతో వధువు తన మనసుమార్చుకుంది. ఈ క్రమంలో సర్సా‌ల్‌లోని దూద్‌మాతా పెట్రోల్ పంపు సమీపంలో కారు ఆపి వెంటనే..అత్తారింటికి నేను వెళ్లను అంటూ ఏడ్వటం మొదలుపెట్టింది. వరుడు కుటుంబ సభ్యులు కూడా ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇంతలోనే అటుగా వస్తున్న పోలీస్ రెస్పాన్స్ వాహనంలోని సిబ్బంది.. నవ వధువు  ఏడ్వటాన్ని చూసి ఆమె దగ్గరకు వెళ్లి ఆరాతీశారు. విషయం తెలుసుకొని పోలీసులు సమీపంలోని  పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.

వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆ నవ వధువును వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇరు వర్గాల అనుమతితోనే వివాహం జరిగిందనీ, కానీ తన ఇంటికి, అత్తగారి ఇంటి ఇంత దూరం ఉంటుందని తెలుసుకోలేక పోయానని వాపోయింది. తాను తన స్వగ్రామానికి వెళ్తున్నామని, తన వివాహాన్ని రద్దు చేయాలంటూ పోలీసులను ప్రాదేయపడింది.

ఈ విషయాన్ని పోలీసులు వధువు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు అసలు వరుడు అలహాబాద్ లో ఉంటాడని చెప్పారని, వారు రాజస్థాన్ ఉంటే..  తమ కూతుర్ని పంపించమని, వివాహాన్ని రద్దు చేయాలని తేగేసి చెప్పారు. దీంతో పోలీసులు వధువును తిరిగి ఉత్తర ప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి పంపించేశారు. చేసేది ఏమీ లేక వరుడు, అతని కుటుంబ సభ్యులు రాజస్థాన్ వెళ్లిపోయారు

ఈ విచిత్ర ఘటనపై ఏసీపీ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. దారిలో ఆగి ఉన్న ఇన్నోవా కారులో వధువు ఏడుస్తోందని తెలిపారు. విచారణలో పెళ్లికి ముందు  అత్తమామలు అలహాబాద్‌లో నివసిస్తున్నారని తనకు చెప్పారని, అయితే.. తనని బికనీర్ (రాజస్థాన్)కి తీసుకువెళుతున్నారని నవ వధువు ఆవేదన వ్యక్తం చేసింది.  పోలీసులు బాలిక తల్లితో మాట్లాడగా.. బాలిక వెళ్లకపోతే సమస్యే లేదని చెప్పింది. ఈ పెళ్లి మాకు వద్దు. దీని తరువాత, పరస్పర ఒప్పందంతో., బాలికను బనారస్‌లోని ఆమె తల్లి వద్దకు పంపారు. అబ్బాయిని బికనీర్‌కు పంపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏడడుగుల బంధం కేవలం 7 గంటల్లో ముగిసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios