కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. ఎటునుంచి ఎవరికి ఎలా వస్తుందో అర్థంకాక చస్తున్నారు. ఇలాంటి గందరోగళంలోనూ... చాలా మంది శుభాకార్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. దీని కారణంగా 400మంది ప్రమాదంలో పడ్డారు.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జ‌రిగిన ఒక వివాహ వేడుక అనంత‌రం క‌ల‌కలం చెల‌రేగింది. క‌రోనా బాధితుడైన వ‌రుని మామ వివాహానికి హాజ‌రైన 400 మందిని క‌లిశాడు. దీంతో1600 మంది జనాభా ఉన్న ఈ కార్ఖేల్ గ్రామంలోని ప్రజలు భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతున్నారు. స్థానిక వైద్య అధికారులు, ప‌రిపాల‌నా విభాగం అధికారులు స‌దరు క‌రోనా పాజిటివ్ వ్య‌క్తిని పెళ్లిలో క‌లుసుకున్న వారి ఆచూకీ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 మేనల్లుని వివాహానికి ముంబై నుంచి వ‌రుడు ఉంటున్న గ్రామానికి అత‌ని మామ‌ వచ్చాడు. అప్పటికే అత‌నిని హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని వైద్యులు చెప్పారు. అయినా అత‌ను వైద్యుల మాట లెక్క‌చేయ‌కుండా వివాహానికి హాజ‌ర‌య్యాడు. ఈ నేపపధ్యంలో పెళ్లికి హాజ‌రైవారంద‌రినీ క‌లుసుకున్నాడు. పెళ్లి అనంత‌రం వ‌రుని మామ క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే, అక్క‌డున్న‌వారికి భ‌యంతో చెమ‌ట‌లు ప‌ట్టాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు స‌ద‌రు క‌రానో బాధితునిపై కేసు న‌మోదు చేశారు.