చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూరులో  సోమవారం నాడు ముహుర్త సమయానికి  పెళ్లి కూతురు పారిపోయింది. దీంతో అదే ముహుర్తానికి మరో యువతితో  యువకుడికి వివాహం జరిపించారు. 

తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూర్‌ములైవాడికి చెందిన యువకుడికి పెత్తనాయక్కన్ పాలెంలోని చిన్నమ్మ సముద్రానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది.

ఆ యువకుడు  సుంగచావడిలో పనిచేస్తున్నాడు.   యువతి ఎమ్మెస్సీ చదువుతోంది.  అత్తూరులోని ఓ ఆలయంలో  సోమవారం  ఉదయం ఆరు గంటలకు పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు.  అయితే సోమవారం ఉదయాన్నే వధువు తరపు కుటుంబసభ్యులు  వివాహా మండపానికి వచ్చారు.  కానీ, ఆ సమయంలో వధువు రాలేదు. పెళ్లి ముహుర్తం  దాటుతున్నా వధువు రాలేదు.

అయితే వివాహాం చూసేందుకు వచ్చిన బంధువుల  అమ్మాయితో అదే ముహుర్తానికి పెళ్లి జరిపించారు. పెళ్లి కూతురు తాను ప్రేమించిన యువకుడితో పారిపోయింది. దీంతో ఆమె పెళ్లి మండపానికి రాలేదు.  వధువు అదృశ్యంపై పోలీసులకు వధువు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన పోలీసులు  వధువు ప్రేమికుడితో పారిపోయిందని గుర్తించారు.