గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. పెళ్లి రోజున వధువుకు గుండెపోటు వచ్చి ఇంటిపై నుంచి కిందపడింది. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. ఈ క్లిష్ట సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అన్ని మనం అనుకున్న విధంగా ఉంటే .. జీవితం ఎలా అవుతోంది. ఎవరూ ఊహించని విధంగా జరగడమే జీవితం. పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో కుటుంబం మొత్తం పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. డ్యాన్స్ జరుగుతూ ఉండేది. ఇంట్లో బంధువులు బారులు తీరారు. ఎక్కడ చూసినా సంబరాలు, సంతోషాల వాతావరణం నెలకొంది. ఇంతలో ఒక్కసారిగా ఆనందం ఆవిరైపోయింది. పెళ్లికూతురు టెర్రస్‌పై నుంచి పడిపోయినట్లు తెలిసింది. వెంటనే పెళ్లి కుతూర్ని ఆస్పత్రికి తరలించినా.. కాపాడలేకపోయారు. ఈ క్లిష్ట సమయంలో వధువు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వివరాల్లోకెళ్తే.. భావ్‌నగర్‌కు చెందిన రాణాభాయ్ బూటవాయ్ అల్గోటార్ కుమారుడు విశాల్ వివాహం జినాభాయ్ రాథోడ్ కుమార్తె హేతల్‌తో నిశ్చయమైంది. అందరూ ఆనందంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కల్యాణ మహోత్సవాన్ని భగవానేశ్వర్ దేవాలయం ఎదుట నిర్వహించారు. ఇళ్లు పెళ్లి వాతావరణంతో కోలాహంగా మారిపోయింది. బంధుమిత్రుల హడావిడి ఓ రేంజ్ లో ఉంది. పెళ్లి తంతు కూడా ప్రారంభమైంది. పెళ్లిమండపంలో భజాబజేంత్రిలు మోగుతున్నాయి. కొద్దిసేపట్లో తర్వాత ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కానీ విధి మరోలా రాసి పెట్టి ఉందోమో..
పెళ్లికి ముందే హేతల్ తల తిరగడం మొదలైంది. ఓపెన్‌గాలిలో ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా టెర్రస్‌పైకి చేరుకుంది కానీ స్పృహతప్పి డాబా మీద నుంచి కిందపడింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు చేతులు ఎత్తేశారు. ఆస్పత్రికి వెళ్లే క్రమంలోనే హేతల్ చనిపోయిందని స్పష్టంగా చెప్పారు. హేతల్‌కు గుండెపోటు వచ్చిందని, దీంతో ఆమెను రక్షించలేకపోయామని వైద్యులు తెలిపారు. ఫలితంగా కాసేపటి క్రితం పెళ్లి సందడి నెలకొని ఉన్న ఇంట్లో కూతురు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇరు కుటుంబాలకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే మల్ధారి సంఘం స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకుంది. ఇరు కుటుంబాలకు వివరించి మాండ్వే నుంచి జీవితం వెనక్కి వెళ్లకూడదని పెళ్లికూతురు చెల్లెలికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. కొంత తడబాటు తర్వాత ఎట్టకేలకు ఇరు కుటుంబాలు ఈ నిర్ణయానికి అంగీకరించాయి.
ఈ ఘటన చాలా బాధాకరమని భావ్‌నగర్ నగర మున్సిపల్ సేవకుడు, మల్ధారీ సంఘం నాయకుడు లక్ష్మణ్‌భాయ్ రాథోడ్ అన్నారు. మేము దానిని తిరిగి ఇవ్వలేము, కానీ మేము ఖచ్చితంగా బాధను తగ్గించగలము. అందుకే సమాజం కలిసి ఈ నిర్ణయం తీసుకుంది. సమాజం గురించి ఆలోచిస్తే.. రెండు కుటుంబాలు చూపిన ఆదర్శం నిజంగా అభినందనీయం. వివాహాది కార్యక్రమాలు పూర్తయ్యే వరకు హేతల్ మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విధి ఆడిన నాటకంతో మరదలు కావాల్సిన యువతి .. చివరికి భార్యగా మారింది. ఈ సంఘటనతో వధువు ఇంట్లో కళ తప్పింది.
