Asianet News TeluguAsianet News Telugu

BREAKING: కేరళలో చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు, కాసేపట్లో తల్లిదండ్రుల చెంతకు

కేరళలోని కొల్లాం జిల్లాలో ఇంటి బయటి నుంచి కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల బాలిక ఆచూకీ  ఎట్టకేలకు లభ్యమైంది. మీడియా కవరేజ్, పోలీసుల విచారణ ద్వారా తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో భయపడిన నిందితులు కొల్లాంలోని ఆశ్రమంలో చిన్నారిని వదిలేసినట్లు సమాచారం.

BREAKING: Six-year-old girl, kidnapped from outside her home in Kerala's Kollam, found ksp
Author
First Published Nov 28, 2023, 2:52 PM IST

కేరళలోని కొల్లాం జిల్లాలో ఇంటి బయటి నుంచి కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల బాలిక ఆచూకీ  ఎట్టకేలకు లభ్యమైంది. మీడియా కవరేజ్, పోలీసుల విచారణ ద్వారా తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో భయపడిన నిందితులు కొల్లాంలోని ఆశ్రమంలో చిన్నారిని వదిలేసినట్లు సమాచారం. అబిగైల్ సారా అనే బాలిక తన ఎనిమిదేళ్ల సోదరుడితో కలిసి ట్యూషన్‌కు వెళుతుండగా దక్షిణ కేరళలోని పూయపల్లిలో నిన్న సాయంత్రం 4:30 గంటలకు ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. 

మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బాలికను కొల్లం ఈస్ట్ పోలీసులు కొనుగొని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మీడియా నివేదికల ప్రకారం బాలిక ఆరోగ్యంగానే వుంద. అబిగైల్‌ను కోర్టు ఎదుట హాజరుపరిచి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. దాదాపు 20 గంటల సుదీర్ఘ గాలింపు చర్యల తర్వాత అబిగైల్ ఆచూకీని పోలీసులు విజయవంతంగా కనుగొనగలిగారు. కొల్లాం ఆశ్రమంలో చిన్నారి ఒంటరిగా కనిపించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమ చిన్నారి క్షేమ సమాచారం కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులకు పాప ఆచూకీ తెలిసినట్లుగా పోలీసులు సమాచారం అందించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కిడ్నాపర్లు ఓ తెలుపు రంగు కారులో వచ్చి బాలికను అపహరించుకుపోయారు. కిడ్నాపర్లలో ఓ మహిళ సహా నలుగురు వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి బారి నుంచి తన సోదరిని కాపాడేందుకు బాలుడు ప్రతిఘటించాడు. అయితే వారు పిల్లాడిని పక్కకు నెట్టేసి ఆమెను కారులో బలవంతంగా తీసుకెళ్లినట్లు పూయపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. 

మరోవైపు.. ఈ కిడ్నాప్ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన డీజీపీని ఆదేశించినట్లుగా సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. బాలిక కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేయవద్దని పినరయి విజయన్ రాష్ట్ర పజలను కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios