చెన్నై: ఇద్దరు ప్రేమించుకొన్నారు, పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే  ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని యువతి కోరింది. దీంతో ఆ యువతి ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కమిషనర్ కార్యాలయ పరిధిలోని ఆలందూరు ప్రాంతానికి చెందిన నిత్య  అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విక్కి అలియాస్ విఘ్నేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తోటి స్నేహితురాలి ద్వారా పరిచయమైన విఘ్నేష్  నిత్యకు పరిచయమయ్యాడు. వీరిద్దరూ తరచూ చాటింగ్ చేసేవారు.

విఘ్నేష్ తనను పెళ్లి చేసుకొంటానని నిత్య చెబుతోంది. విఘ్నేష్ తన కన్నా మూడేళ్లు చిన్నవాడు. తనకు పుట్టుకతోనే కిడ్నీ లేదనే విషయం నాలుగేళ్ల క్రితం తెలిసిందని తాను విఘ్నేష్ కు చెప్పినట్టు  నిత్య గుర్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే తాను దివ్యాంగుడనని ఈ పెళ్లికి తనకు అభ్యంతరం లేదని చెప్పినట్టు ఆమె చెబుతోంది. 2017 ఫిబ్రవి 26వ తేదీన ఇద్దరి కుటుంబసభ్యుల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. ఇదే సమయంలో తన తండ్రి చనిపోతే  పెళ్లికి ఆలస్యమైందని నిత్య ఆరోపిస్తున్నారు. 

ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలిన విఘ్నేష్‌ను కోరితే తనకు కిడ్ని లేదనే కారణాన్ని చూపిస్తూ పెళ్లికి ఒప్పుకోవడం లేదన్నారు.ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.