ఓ ప్రియుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ ఏమయ్యిందో తెలియదు.. అక్కడికి వెడుతూనే వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయాడు. ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

మధ్యప్రదేశ్ : ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమె పేరును తన గుండెలపై Tattooకూడా వేసుకున్నాడు.. ప్రియురాలిని కలిసేందుకు ఇటీవల ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఏం జరిగిందో తెలియదు.. ఆమె ఇంటి ముందుకు వెళ్ళగానే కుప్పకూలిపోయాడు... Vomiting చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.. ఈ విషాద ఘటన Madhya Pradeshలోని సాగర్ జిల్లాలో జరిగింది.

సాగర్ జిల్లా లోని చిరాయ్ గ్రామానికి చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి దుగ్ సర గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగుతోంది. శ్రీ రామ్ తన ప్రియురాలిపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఛాతిపై ప్రియురాలి పేరును పచ్చబొట్టుగా కూడా వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిని కలిసేందుకు శ్రీధర్ గురువారం ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆమె ఇంటి ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి శ్రీరామ్ ను అలా చూసి షాక్ అయ్యింది.

వెంటనే కుటుంబసభ్యలుకు తెలిపింది. ఆ యువతి కుటుంబ సభ్యులు వెంటనే శ్రీరామ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీరామ్ మరణించాడు. శ్రీరామ్ మృతికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. గుండెపోటు వచ్చిందని కొందరు భావిస్తున్నారు. విషం తాగి చనిపోయి ఉంటాడని మరికొందరు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. 

ఇదిలా ఉండగా, గతనెలలో దీనికి విరుద్దమైన ఘటన చెన్నైలో జరిగింది. మార్చి 22న ఓ ప్రియుడు ప్రియురాలిని చంపేశాడు. ప్రేమిస్తే చాలు మహిళలు ఏం చెబితే అది చేయాలని కోరుకుంటారు. దానికి నిరాకరిస్తే దారుణానికి తెగబడతారు. ఇలాంటి మృగాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. ఓ వ్యక్తి ఓ మహిళను ఐదేళ్లుగా ప్రేమించాడు. ప్రేమించాను కదా అని శారీరక సంబంధానికి బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి తెగబడ్డాడు. 

sexకి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని knifeతో పొడిచి చంపిన ప్రియుడు బాగోతం tamilnadu రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నైలోని కుండత్తూర్ ప్రాంతానికి చెందిన రాజా(38) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ womanను గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మహిళ అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పని చేస్తుండేది. శనివారం రాత్రి పీకల దాకా liquor తాగిన రాజా ప్రియురాలి ఇంటికి వెళ్లి తనతో పడుకోమని బలవంతం చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు.

దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రియుడు, ప్రియురాలు గొడవ పడుతుండడంతో... ఇరుగుపొరుగు వారు వచ్చి రాజాను ఇంటి నుంచి పంపించి వేశారు. అందరూ అక్కడినుంచి వెళ్లిపోయి.. నిద్రపోయాక తిరిగివచ్చిన రాజా.. ప్రియురాలిని బంధించి కత్తితో పొడిచి పారిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్టు ధరించిన రాజా కుండ్రత్తూర్ వద్ద కూర్చుని ఉండగా గస్తీ పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు. దీంతో హత్య విషయం వెలుగుచూసింది. తన ప్రియురాలిని హత్య చేసినట్లు రాజా అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.