ఓ ఇంటర్ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముఖానికి ముల్తానీ మట్టి పెట్టుకొని.. కళ్ల నిండా కాటుక పెట్టుకొని, పెదాలకు లిప్ స్టిక్ రాసుకొని.. వాళ్ల అమ్మ చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కి చెందిన అమర్‌నాథ్ దుబే అనే వ్య‌క్తి కుటుంబంతో స‌హా రాజీవ్ నగర్‌లో మూడేళ్లుగా ఉంటున్నారు. అమర్‌నాథ్ దుబే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండ‌గా, భార్య కిరణ్ కూలీగా, పెద్ద కుమారుడు సుశీల్ దుబే ట్రక్ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నారు. చిన్న కుమారుడు రోహిత్ దుబే (18) ఇంటర్ చ‌దువుతున్నాడు.

 కుటుంబ సభ్యులందరూ ఎవ‌రి ప‌నుల్లోకి వారు వెళ్లిపోగా, రోహిత్ గదిలోకి వెళ్లి, తాళం వేసుకున్నాడు. త‌రువాత ముఖానికి ముల్తానీ మిట్టి పూసుకుని, కళ్ల‌కు కాటుక పెట్టుకుని, పెదవులకు లిప్‌స్టిక్ రాసుకుని చీర సాయంతో ఉరివేసుకున్నాడు. మధ్యాహ్నం పని నుంచి తిరిగి వచ్చిన అత‌ని తల్లి తలుపు తట్టింది. త‌లుపు తీయ‌క‌పోయేస‌రికి, కిటికీ నుంచి లోప‌లికి తొంగిచూసింది. 

 కొడుకు మృతదేహం వేలాడుతుండటం చూసి, స్పృహ‌త‌ప్పి కింద‌ పడిపోయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. రోహిత్ ఎందుకు ఆత్మ‌హత్య చేసుకున్నాడ‌నే దానిపై ద‌ర్యాప్తు ప్రారంభించారు. రోహిత్ గ‌త కొద్ది రోజులుగా ముభావంగా ఉంటున్నాడ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.