Mercedes-Benz SUV: ద‌క్షిణాది రాష్ట్రాల ఉద్యోగులు నిజాయితీగా, ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తార‌నేదానికి ఇప్ప‌టికే అనేక ఘ‌ట‌న‌లు నిద‌ర్శ‌నంగా నిలిచాయి. ఇదే త‌రహాలో త‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న ఉద్యోగి నిజాయితీకి, అత‌ని కృషికి ఫ‌లితంగా ఏకంగా మెర్సిడెస్ బెంజ్‌కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు ఓ వ్యాపారి. కేర‌ళ‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.  

Mercedes-Benz SUV: కంపెనీలు త‌మ ఉద్యోగుల ప‌నితీరు మెరుగ్గా ఉంటే వారికి ప్రోత్సాహ‌కాలు అందించ‌డం సాధార‌ణ విష‌యమే. అయితే, ఓ వ్యాపారి మాత్రం త‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి ఏకంగా బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఉద్యోగి నిజాయితీ, అత‌ని కృషికి ప్ర‌తిఫ‌లంగా ఈ గిఫ్ట్ అందిస్తున్న‌ట్టు స‌ద‌రు వ్యాపారి పేర్కొన్నాడు. త‌న ఉద్యోగిని శ్ర‌మ‌ను కొనియాడాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అంశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకెళ్తే.. ద‌క్షిణాది రాష్ట్రాల ఉద్యోగులు నిజాయితీగా, ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తార‌నేదానికి ఇప్ప‌టికే అనేక ఘ‌ట‌న‌లు నిద‌ర్శ‌నంగా నిలిచాయి. ఇదే త‌రహాలో త‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న ఉద్యోగి నిజాయితీకి, అత‌ని కృషికి ఫ‌లితంగా ఏకంగా మెర్సిడెస్ బెంజ్‌కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు ఓ కేర‌ళ బిజినెస్ మ్యాన్‌. ఆ బ్రాండ్ న్యూ Mercedes-Benz SUV ధ‌ర రూ.45 లక్ష‌ల‌కు పై మాటే. 

కేరళలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల ప్రీమియర్ రీటైలర్ అయిన మైజీ (myG) సంస్థ అధినేత AK షాజీ.. త‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి బ్రాండ్ న్యూ Mercedes-Benz SUV బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఈ ఖ‌రీదైన గిప్ట్ ను అంతుకున్న ఉద్యోగి Mr CR అనిష్. అత‌ను గ‌త 22 సంవ‌త్స‌రాలుగా మైజీ (myG) లో ఉద్యోగిగా కొన‌సాగుతున్నాడు. నిజాయితీ, శ్ర‌మించే వ్య‌క్తిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. ఏకే. షాజీ.. మైజీ (myG) ని స్థాపించడానికి చాలా కాలం ముందు నుంచి అనీష్‌తో అనుబంధం క‌లిగి ఉన్నారు. అనీష్ మైజీ (myG) ని స్థాపించిన‌ప్ప‌టి నుంచి సంస్థ మార్కెటింగ్, నిర్వహణ మరియు వ్యాపార అభివృద్ధి విభాగాలతో సహా వివిధ హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం ఆ సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా కొన‌సాగుతున్నారు. 

కేర‌ళ‌లో 2006లో ప్రారంభమైన myG, రాష్ట్రవ్యాప్తంగా 100 స్టోర్‌లతో కేరళలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్‌గా ఎదిగింది. ఏకే.షాజీ పంచుకున్న ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో.. త‌న ఉద్యోగిని నిజాయితీని, అత‌ని కృషి కొనియాడుతూ ప్ర‌శంస‌లు కురిపించాడు. అనీష్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వీడియోలో కనిపించాడు. “నేను మైజీని ప్రారంభించక ముందు కూడా అనీష్ గత 22 సంవత్సరాలుగా నాతో ఉన్నాడు. అతను నాకు బలమైన స‌పోర్టుగా నిల‌బ‌డ్డాడు. అతను నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు. అతని సోదర ఆప్యాయత, పని పట్ల అపారమైన దృష్టి, అంకితభావం నాకు చాలా మద్దతు ల‌భించేలా చేశాయి. త‌ను నా ఉద్యోగి కాదు.. నేను అనీష్‌ను భాగస్వామిగా భావిస్తున్నాను” అని షాజీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. 

అయితే, మైజీ (myG) అధినేత ఏకే.షాజీ త‌న ఉద్యోగుల‌కు బ‌హుమ‌తులు ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి కాడు. గ‌తంలోనూ ఆయ‌న త‌న ఉద్యోగుల‌కు ఖ‌రీదైన కార్ల‌ను, వ‌స్తువుల‌ను బ‌హుమ‌తులుగా అందించారు. రెండు సంవ‌త్స‌రాల కింద‌ట మైజీ (myG) లో ప‌నిచేస్తున్న త‌న‌ ఆరుగురు ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చాడు. అలాగే, అనేక సార్లు త‌న ఉద్యోగుల‌ను విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు తీసుకెళ్లాడు. త‌న ఉద్యోగికి ఖ‌రీదైన మెర్సిడెస్ బెంజ్‌కారు ఇవ్వ‌డంతో షాజీపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.