Asianet News TeluguAsianet News Telugu

కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా టూర్ రద్దు

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైంది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.
 

Boris Johnson Cancels Republic Day Visit To India Over Covid Crisis In UK lns
Author
New Delhi, First Published Jan 5, 2021, 6:02 PM IST

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైంది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.

ఈ ఏడాదిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ ఆహ్వానానికి గత నెలలోనే అంగీకరించారు.

ఈ నెల చివర్లో తాను భారత్ ను సందర్శించలేనని  భారత ప్రధానితో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  మాట్లాడినట్టుగా బ్రిటిష్ వార్తా సంస్థ తెలిపింది.ఈ విషయమై మోడీతో మంగళవారం నాడు ఉదయం ఫోన్ లో మాట్లాడారని ఆ వార్తా సంస్థ ప్రకటించింది.

ఇంగ్లాండ్ లో ఫిబ్రవరి వరకు లాక్ డౌన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్ లో గుర్తించారు. బ్రిటన్ నుండి ఇతర దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. దీంతో ఇప్పటికే బ్రిటన్ చాలా దేశాలు విమానాలను నిషేధించాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తూ బ్రిటన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios