Asianet News TeluguAsianet News Telugu

సాదాసీదా జిందగీతో విసిగిపోయాం.. అందుకే భూటాన్ ఆర్మీలో చేరాం.. ఆరుగురు ఇంజినీర్ల స్టోరీ ఇదే

భుటాన్ ఆర్మీలో కొత్తగా 13 మంది చేరనున్నారు. వారు డెహ్రడూన్‌లో మిలిటరీ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఇందులో ఆరుగురు ఇంజినీర్లు. వారు తమ సాదాసీదా జీవితంతో బోర్ కొట్టి ఆర్మీలో చేరామని వివరించారు.
 

bored engineers completed military training to be join in bhutanese military
Author
First Published Dec 11, 2022, 4:27 PM IST

న్యూఢిల్లీ: కొందరేమో సాదాసీదా జిందగీ కోసం చాలా కష్టపడతారు. అదే డ్రీమ్‌గా భావిస్తారు. ఇంకొందు ఆ జీవితంపై విసిగిపోయి ఉంటారు. రోజులు చాలా స్తబ్దుగా గడిచిపోవడాన్ని సహించలేరు. సాహసాలు, ప్రయోగాలకు వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ కోవకు చెందినవారే భూటాన్‌కు చెందిన ఆ ఆరుగురు ఇంజినీర్లు. మోనాటనస్ లైఫ్‌తో బోర్ కొట్టి ఆర్మీ ఎంచుకున్నామని వారు చెప్పారు.

ఈ ఏడాది గరిష్ట సంఖ్యలో విదేశీ క్యాడెట్లు పాస్ అయ్యారు. భూటాన్ కు చెందిన 13 మంది క్యాడెట్లు ఈ ఏడాది డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి పాస్ అయ్యారు. వీరు రాయల్ భూటాన్ ఆర్మీలో సేవలు అందిస్తారు. ఇందులో ఆరుగురు ఇంజినీర్లు ఉన్నారు. 

వారు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. వారు మోనాటనస్ సివిలియన్ లైఫ్ గడపాలని అనుకోవడం లేదని, అందుకే ఇంజినీరింగ్ చేసినా ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తమకు జీవితం మొత్తం సవాళ్లతో కూడుకుని ఉండాలని కోరుకుంటామని వారు వివరించారు. ఆర్మీలో చేరిన తర్వాత తాము కోరుకున్నట్టు లైఫ్ ఉంటుందని ఆశిస్తున్నట్టు 25 ఏళ్ల భుటానీస్ ఆఫీసర్ డిజిగ్నేటెడ్ ఫుంత్షో తోగ్‌బే అన్నారు.

Also Read: రష్యా మిలిటరీ ట్రైనింగ్ గ్రౌండ్‌పై దాడి.. 11 మంది మృతి.. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఘటన..

25 ఏళ్ల తిన్లే నాంగ్యాల్ ధ్రుక్డా కూడా ఇదే విధంగా చెప్పుకొచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన ధ్రుక్డా మాట్లాడుతూ, తాను ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన తర్వాత కుటంబం నిర్వహిస్తున్న నిర్మాణ వ్యాపారంలో రెండేళ్లు పని చేశానని వివరించారు. కానీ, అలాగే కొనసాగించాలని కోరుకోవడం లేదని తెలిపారు.

‘నా జీవితం బాగానే ఉన్నది. కానీ, నాకు కొన్ని థ్రిల్స్, అడ్వెంచర్స్ కావాలని అనుకున్నా. అలాంటప్పుడు దేశ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడానికి మించి మరేం ఉంటుంది’ ధ్రుక్డా వివరించారు.

ఈ ఆర్మీ ట్రైనింగ్ అంత సులువుగా ఏమీ లేదని, చాలా సవాళ్లు ఎదుర్కొన్నామని, ట్రైనింగ్ తొలినాళ్లలో తాము అడ్జస్ట్ కావడానికి సమయం పట్టిందని ఆ భుటానీస్ ఆఫీసర్లు తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన షెరింగ్ వాంగ్‌చుక్ కూడా ట్రైనింగ్ తొలినాళ్లు చాలా కఠినంగా గడిచాయని, రెస్ట్ లేకుండా కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. తర్వాత తాము అందుకు అలవాటు అయ్యామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios