Asianet News TeluguAsianet News Telugu

నవనీత్ కౌర్ దంపతులకు షాకిచ్చిన హైకోర్టు: ఎఫ్ఐఆర్‌ కొట్టివేయాలన్న పిటిషన్ల డిస్మిస్

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలకు సోమవారం నాడు హైకోర్టు షాకిచ్చింది. వీరిద్దరూ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది ఉన్నత న్యాయ స్థానం.

Bombay High Court Rejects MP Navneet Rana And Ravi Rana  Plea to quash FIR against them
Author
Mumbai, First Published Apr 25, 2022, 8:23 PM IST | Last Updated Apr 25, 2022, 8:23 PM IST


ముంబై: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ Navaneet Kaur , ఆమె భర్త ఎమ్మెల్యే Ravi Rananaలకు సోమవారం నాడు చుక్కెదురైంది. తమపై దాఖలైన FIR  ను రద్దు చేయాలని  వీరిద్దరూ Mumbai కోర్టులో పిటిషన్  దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను ముంబై High Court  ఇవాళ డిస్మిస్ చేసింది. 

సీఎం Uddhav Thackeray నివాసం మాతోశ్రీ వెలుపల Hanuman Chalisa  పారాయణం చేస్తామని నవనీత్ కౌర్ దంపతులు ప్రకటించారు. ఈ నెల 23న సీఎం  ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠనం చేస్తామని ప్రకటించారు. దీంతో ముంబైలో ఉద్రిక్తత నెలకొంది. Narendra Modi  పర్యటనను పురస్కరించుకొని తమ కార్యక్రమాన్ని రద్దు చేసుకొంటున్నట్టుగా కూడా అదే రోజున నవనీత్ కౌర్ దంపతులు ప్రకటించారు. ఈ నెల 23న సాయంత్రం నవనీత్ కౌర్ ఆమె భర్త రవి రాణాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖర్ పోలీస్ స్టేషన్ లో వారిపై  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఒకరి ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన శ్లోకాలు చదవమని ప్రకటించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించడమేనని కోర్టు పేర్కొంది. ఇలాంటి చర్య శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తుందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది.  ఆదివారం నాడు బాంద్రా కోర్టు నవనీత్ కౌర్ దంపతులకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇవాళ  తమపై నమోదైన FIR  ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు Dismissచేసింది. నవనీత్ కౌర్ దంపతులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

అమరావతి ఎంపీ స్థానం నుండి నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. అమరావతి జిల్లాలోని బద్నేరా స్థానం నుండి  రవి రాణా ఎమ్యేల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios