Asianet News TeluguAsianet News Telugu

వృద్ధ తల్లిదండ్రులకు కొడుకు వేధింపులు.. ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మన్న హైకోర్టు...

ఆశిష్ దలాల్,  ఆయన భార్య కలిసి  ఆశిష్ తల్లిదండ్రుల ఫ్లాట్ లో ఉంటున్నారు.  ఆశిష్ తండ్రి వయస్సు 90 సంవత్సరాలు. తల్లి వయసు 89 సంవత్సరాలు.  ఈ వృద్ధ తల్లిదండ్రులకు ఆశిష్ ఒక్కడే సంతానం. ఆ వృద్ధులను ఆశిష్ దంపతులు చాలా కాలం నుంచి వేధిస్తున్నట్లు కేసు నమోదయింది.

Bombay HC orders eviction of abusive son from parents flat
Author
Hyderabad, First Published Sep 17, 2021, 5:20 PM IST

ముంబై : తల్లిదండ్రులను వేధించిన కొడుకు పైనా, ఆయన భార్య పైనా బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఓ నెలలోగా ఆ వృద్ధ తల్లిదండ్రుల ఫ్లాట్ ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ కొడుకు, కోడలిని ఆదేశించింది. 

ఆశిష్ దలాల్,  ఆయన భార్య కలిసి  ఆశిష్ తల్లిదండ్రుల ఫ్లాట్ లో ఉంటున్నారు.  ఆశిష్ తండ్రి వయస్సు 90 సంవత్సరాలు. తల్లి వయసు 89 సంవత్సరాలు.  ఈ వృద్ధ తల్లిదండ్రులకు ఆశిష్ ఒక్కడే సంతానం. ఆ వృద్ధులను ఆశిష్ దంపతులు చాలా కాలం నుంచి వేధిస్తున్నట్లు కేసు నమోదయింది.

ఏకైక కుమారుడు, కోడలు చేతుల్లో వృద్ధ తల్లిదండ్రులు బాధలు అనుభవిస్తున్నారని బాంబే హైకోర్టు గమనించింది. ఆశిష్ కు నవీ ముంబై, దహీసార్ ఏరియాలో మూడు ఇళ్లు ఉన్నప్పటికీ, తన తల్లిదండ్రుల ఫ్టాట్ లోనే ఉంటానని పట్టుబడుతున్నట్లు గుర్తించింది. ఆశిష్ ను, ఆయన భార్యను వృద్ధ తల్లిదండ్రుల ఫ్లాట్ నుంచి వెళ్లిపోవాలని తీర్పు చెప్పింది.  

తల్లిదండ్రులు తమను తాము కాపాడుకోవడానికి,  తమ సొంత కుమార్ ల వేధింపుల నుంచి రక్షించుకోవడానికి  కోర్టులను ఆశ్రయించవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆడపిల్లలెప్పుడూ ‘ఆడ’పిల్లలేనని... కొడుకులు పెళ్లయ్యే వరకు మాత్రమే కొడుకులని ఓ సామెత ఉందని, దీనిలో కొంత సత్యం ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.  అయితే దీనికి కచ్చితంగా అసాధారణ మినహాయింపులు ఉంటాయని పేర్కొంది.

షార్ట్స్ వేసుకున్న విద్యార్థినికి పరీక్ష వద్దన్న టీచర్.. చివరికి కర్టెన్ చుట్టుకుని..!

వృద్ధులు సాధారణ జీవితం జీవించేలా,  ఎటువంటి వేధింపులకు గురి కాకుండా ఉండేలా వారి సంతానం,  బంధువులు చూడాలని  సీనియర్ సిటిజన్స్ యాక్ట్ చెబుతోందని హైకోర్టు పేర్కొంది.  ప్రస్తుత కేసులో కొడుకు తన వృద్ధ తల్లిదండ్రులు సాధారణ జీవితం జీవించకుండా  ఉద్దేశపూర్వకంగా నిరోధించడం చాలా విచారకరమని తెలిపింది.  

సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం…  పిల్లలు లేదా బంధువులు..  సందర్భాన్ని బట్టి  ఎవరైతే వారు, వృద్ధులు సాధారణ జీవితం జీవించేలా చూడాలని తెలిపింది.  ఇది వారి బాధ్యత అని పేర్కొంది. అంతేకాదు తల్లిదండ్రుల  ఫ్లాట్ నుంచి వెళ్లి పోవాలని ఆశిశ్‌కు, ఆయన భార్యకు సీనియర్ సిటిజన్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన అప్పీలును హై కోర్టు విచారించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios