Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హెలిపాడ్ వద్ద బాంబు గుర్తింపు

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్  ఇంటికి సమీపంలో ఇవాళ బాంబును గుర్తించారు పోలీసులు. ఈ బాంబును నిర్వీర్యం చేశారు పోలీసులు.
 

 bomb shell found near Punjab CM Bhagwant Mann's  helipad
Author
First Published Jan 2, 2023, 6:16 PM IST

చందీఘఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్  హెలిపాడ్  వద్ద సోమవారం నాడు బాంబును  పోలీసులు గుర్తించారు.  వీఐపీలు నివాసం ఉండే ఈ ప్రాంతంలో  లైవ్ బాంబును పోలీసులు గుర్తించారు.  హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం కూడా బాంబు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది. పంజాబ్, హర్యానాల సెక్రటేరియట్  , అసెంబ్లీ కూడా బాంబు దొరికిన ప్రదేశానికి సమీపంలోనే ఉన్నాయి.ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.   కన్సల్ టీ పాయిట్, నయాగావ్ మధ్య మామిడి తోటలో  బాంబు షెల్ లభ్యమైంది. పంజాబ్ సీఎం నివాసానికి  ఈ ప్రాంతం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios