జమ్మూ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో గురువారం నాడు  పేలుడు చోటు చేసుకొంది.  


శ్రీనగర్: జమ్మూ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో గురువారం నాడు పేలుడు చోటు చేసుకొంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బస్టాండ్లో ఆగి ఉన్న ఓ బస్సులో బాంబు పేలినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చోటు చేసుకొన్న వెంటనే జమ్మూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ ఘటనలో 18 మంది గాయపడినట్టు పోలీసులు చెప్పారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గ్రేనేడ్ వల్లే పేలుడు వాటిల్లిందని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడ ఇదే రకంగా ఇదే బస్టాండ్ లో పేలుడు సంభవించినట్టుగా పోలీసులు గుర్తు చేస్తున్నారు.