ఐపిఎల్ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరైన అర్బాజ్ ఖాన్ (వీడియో)

bollywood actor arbaaz khan attended in thane police station
Highlights

ఐపిఎల్-11 సీజన్ లో అర్బాజ్ 3 కోట్లు నష్టపోయాడా?

ఐపిఎల్ బెట్టింగ్ కేసులో సినీనటుడు, బాలీవుడ్ నిర్మాత అర్బాజ్ ఖాన్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. బెట్టంగ్ కేసులో బుకీలు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న అర్బాజ్ కు థానె పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ అర్బాజ్ థానే యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

ఐపిఎల్-11 లో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు గత నెలలో పట్టుకుని విచారించారు. ఈ బెట్టింగ్ వ్యవహారంలో కీలక బుకీగా పనిచేసిన సోనూ జలాన్ విచారణ సందర్భంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ పేరు బైటపెట్టినట్లు సమాచారం. దీంతో పోలీసులు అర్బాజ్ కు నిన్న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఐపిఎల్ సీజన్ లో సోనూ ద్వారా బెట్టింగ్ కు పాల్పడిన అర్బాజ్ దాదాపు మూడు కోట్ల వరకు నష్ట పోయినట్లు సమాచారం. ఈ బెట్టింగ్ వ్యవహారంలో మరింత మంది బాలీవుడ్ సినీ ప్రముఖుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అర్బాజ్ విచారణలో అలాంటి వారి పేర్లు బైటపడే అవకాశం ఉండవచ్చని సమాచారం. 

 

బెట్టింగ్ లో ప్రధాన బుకీగా వున్న సోను జలాన్ కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తో సంబంధాలున్నట్లు బైటపడింది. కేవలం ఈ బెట్టింగ్ లు,, మ్యాచ్ ఫిక్సింగ్ ల ద్వారానే సోను యేడాదికి దాదాపు రూ.100 కోట్లు సంపాదించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.  
 

loader