లక్నో: రెండు రోజుల నుండి కన్పించకుండా పోయిన ఓ బాలిక శవమై తేలింది.  ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జమాల్‌పూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గురువారం నాడు ఇంటి నుండి బయటకు వెళ్లింది. అప్పటి నుండి ఆ బాలిక మళ్లీ తిరిగి రాలేదు.

 ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బాలిక ఆచూకీ కోసంగ గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్క రోజు తర్వాత బాలిక ఆచూకీ శుక్రవారం నాడు సాయంత్రం లభ్యమైంది. గ్రామ శివారులోని పొలాల వద్ద ఆ బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

బాలిక మృతదేహం వద్ద విషం డబ్బాను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా ఎవరైనా బలవంతంగా విషం తాగించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.