Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిదేళ్ల చిన్నారి కిడ్నాప్.. పక్కింట్లో ప్లాస్టిక్ కవర్ లో చుట్టి...దారుణం..

బాలుడి తల్లిదండ్రులు ఉత్తమ్ నగర్ లో ఉంటారు. సోమవారం నాడు ఇంట్లో నుంచి ఒక్కసారిగా బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 

Body Of Missing 9-Year-Old Boy Found Stuffed In Plastic Bag: Delhi Police
Author
Hyderabad, First Published Oct 14, 2021, 8:32 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ : ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన తొమ్మిదేళ్ల బాలుడు శవమై దొరికాడు. కొద్ది రోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయిన చిన్నారి.. ద్వారక లోని తన నివాస ప్రాంతానికి దగ్గర్లో ఓ ప్లాస్టిక్ కవర్ లో కుక్కి అతని మృతదేహం దొరికింది. 

బాలుడి తల్లిదండ్రులు ఉత్తమ్ నగర్ లో ఉంటారు. సోమవారం నాడు ఇంట్లో నుంచి ఒక్కసారిగా బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 

ఈ క్రమంలో గాలింపు చేపట్టిన పోలీసులకు వాళ్లింటికి కాస్త దూరంలోని మరో ఇంట్లో చిన్నారి మృతదేహం లభించింది. dead body మెడ మీడ, శరీరంలో పలుచోట్ల గాయాలున్నాయి. ఈ మేరకు పోలీసులు  మాట్లాడుతూ.. మృతదేహాన్ని రికవరీ చేసే సమయంలో శరీరంలో పలు గాయాలున్నట్టు గుర్తించామని తెలిపారు. 

ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న కొంతమందిని ఇప్పటికే పోలీసులు విచారించారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహం లభ్యం కావడంతో kidnap case ను murderకేసు గా రిజిస్టర్ చేశామని, మృతదేహాన్ని autopsy కోసం పంపామని, ఆ నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 

మృతదేహం దొరికిన ప్రాంతాన్ని క్రైం టీం పర్యవేక్షించిందని, చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తుందని పోలీసులు తెలిపారు. బాలుడు కిడ్నాప్ అయిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో, బాలుడ్ని ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి.. తద్వారా నిందితులను త్వరితగతిన పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. 

ప్రాథమిక విచారణలో చిన్నారిని చంపిన తరువాత   plastic bagలో కుక్కి, ఇంట్లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. 

యూపీలో దారుణం... మైనర్ బాలికపై కన్నతండ్రితో సహా 28మంది అత్యాచారం

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లోని chittoorజిల్లా కేవీ పల్లిలో కిడ్నాప్  అయిన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. చెట్ల పొదల మధ్య బాలుడు తేజస్ రెడ్డి మృతదేహం కనిపించింది. బంధువులే బాలుడిని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. చీనేపల్లి పక్కనే వున్న మేకలవారి పల్లెలోని అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన tejas reddyకనిపించకుండా పోయాడు. 

ఎంత వెతికినా చిన్నారి జాడ దొరక్కపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తేజస్ కోసం తీవ్రంగా గాలించారు. చివరికి పొదల మధ్య బాలుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మండలంలోని గేరంపల్లి పంచాయతీ సంకేనిగుట్టపల్లికి చెందిన నాగిరెడ్డి దంపతులు తమ కుమారుడు తేజశ్‌ రెడ్డి(8)ని పీలేరులోని బంధువుల ఇంట్లో వదిలి.. భార్యాభర్తలిద్దరూ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం బాలుడు తన అమ్మమ్మ స్వగ్రామమైన ఎగువమేకలవారి పల్లెకు వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో తేజశ్‌ రెడ్డి తన అమ్మమ్మకు చెప్పి ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

చిత్తూరు : బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం ... బొప్పాయి తోటలో శవమై తేలిన చిన్నారి

అయితే బాలుడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న కమ్మంవారిపల్లె పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని బొప్పాయి పొలంలో తేజస్ రెడ్డి మృతదేహం కనిపించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios