Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో షాకింగ్.. వ్యక్తిని చంపి,శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి..వీడియో తీసి, పాకిస్థాన్ కు...

ఉగ్రవాద లింకుల అనుమానంలో ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఓ వ్యక్తిని హత్య చేసి.. మూడు ముక్కలుగాచేసి పడేసిన విషయం వెలుగు చూసింది. 

body chopped into 3 pieces found In Delhi, after 2 arrested over terror links
Author
First Published Jan 16, 2023, 6:58 AM IST

ఢిల్లీ : ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉగ్ర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగు చూసాయి. ఓ వ్యక్తి హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా తేలారు.  ఢిల్లీలో దొరికిన మృతదేహం వెనక ఉగ్రకోణం ఉన్నట్లుగా వెలుగులోకి వచ్చింది.  అంతేకాదు, హత్యకు ముందు నిందితులు వీడియో తీశారు. ఆ వీడియోను పాకిస్తాన్ కి పంపించి.. అక్కడి నుంచి డబ్బులు  తీసుకున్నట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 

ఢిల్లీలోని జహంగీర్పూర్ పరిసరాల్లోని ఒక ఇంటిపై పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ఆ ఇంట్లో ఉన్న నౌషద్ (59), జగ్జీత్ సింగ్ (29)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు  చేశారు. వీరి దగ్గర నుంచి 22 రౌండ్లు, మూడు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. టార్గెట్ కిల్లింగ్స్ చేయడానికి వీరిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో వీరిద్దరిని తీవ్రంగా విచారించగా..  బలాస్వా డైరీ శ్రద్ధానంద్ కాలనీలో వీరు అద్దెకు ఉన్న గదిలో కూడా తనిఖీలు చేశారు. అక్కడ రెండు గ్రానైడ్లు దొరికాయి. దీంతో ఫోరెన్సిక్ బృందం ఆ గదిలో గాలింపు చేసింది.  

భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమే: సుప్రీంకోర్టును ఆశ్రయించిన 'కాళి' డైరెక్టర్ లీనా మణిమేకలై

వారి తనిఖీల్లో రక్తపు మరకలు కనిపించాయి. పోలీసుల అనుమానాలు దీంతో నిజంగా మారాయి. వీరు ఎవరినో హత్య చేశారని ఆ దిశగా విచారణ ప్రారంభించారు. దీంట్లో వెలుగు చూసిన విషయాలు  భయాందోళనలు కలిగించేలా ఉన్నాయి. ఆదర్శనగర్ లో ఉండే ఓ వ్యక్తి మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు. అతనితో వీరిద్దరూ స్నేహంగా ఉండేవారు. అలా అతడిని మెల్లిగా నమ్మించి భలాస్వా డెయిరీ సమీపంలోని ఇంటికి తీసుకువచ్చి హత్య చేశారు.  అంతేకాదు, అతడిని చంపుతున్న సమయంలో 37 సెకండ్ల వీడియోను కూడా తీసి పాకిస్తాన్ లోని లష్కరే ఉగ్రవాది సోహైల్ కు పంపినట్లు తెలిసింది. 

ఆ వీడియో పంపిన తర్వాత ఖతార్ లో ఉంటున్న సోహైల్ బావ అకౌంట్ నుంచి వీరిలో ఒకరైన నౌషద్ అకౌంట్ కు రూ.2లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి.  హత్య చేసిన  తర్వాత  ఆ వ్యక్తిని మూడు ముక్కలుగా చేశారు. వీటిని ఉత్తర ఢిల్లీలో పడేశారు. విచారణలో తాజాగా నిందితులు ఈ వివరాలు బయటపెట్టారు. దీని ప్రకారం గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  మృతదేహం చేతిపై ఉన్న త్రిశూలం పచ్చబొట్టు ఆధారంగా చనిపోయిన వ్యక్తిని గుర్తించారు. నౌషాద్ పై గతంలో కూడా ఉగ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకసారి అరెస్టు కూడా అయ్యాడు. హత్య, బెదిరింపులకు పాల్పడడం, బలవంతంగా వసూలు చేయడం వంటి ఆరోపణలు ఇతడి మీద ఉన్నాయి. 

హర్కత్ ఉల్ అన్సార్ గ్రూప్ తో నౌషద్ కు సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో నౌషద్ చాలాకాలం జైల్లోనే గడిపాడు.. ఈ క్రమంలోనే అతడికి సోహెలు కలిశాడు. సోహైల్  లష్కరే ఉగ్రవాది.. మరో నిందితుడు ఆరిఫ్ మహమ్మద్ లతో  జైల్లోనే పరిచయమైంది. ఆరిఫ్ ఎర్రకోటపై దాడి కేసులో నిందితుడు. 2018లో మంచి విడుదలైన తర్వాత సోహెల్ పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఏప్రిల్ 2022న నౌషద్  జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటినుంచి సోహెల్ తో టచ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో వర్గానికి చెందిన వ్యక్తులను హత్య చేసే పనిని సోహైల్ నౌషాద్ కు అప్పజెప్పాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన జగ్జీత్సింగ్ కు కూడా ఉగ్ర లింకులు ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దీప్ దల్లాతో సంబంధాలు ఉన్నట్లుగా వెలుగులోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios