Asianet News TeluguAsianet News Telugu

నమ్మ బెంగళూరు ఫౌండేషన్‌తో చేతులు కలిపిన boAt ... ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు కంప్యూటర్ శిక్షణ

boAt ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం కంప్యూటర్ క్లాసెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు నమ్మ బెంగళూరు ఫౌండేషన్ (ఎన్‌బీఎఫ్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా బెంగళూరు రామమూర్తి నగర్‌లో కంప్యూటర్ ట్రైనింగ్ ఫెసిలిటీని ప్రారంభించింది. 

boAt sails into the future of education with Namma Bengaluru Foundation: Bridging the Digital Divide for Government School Students ksp
Author
First Published Jan 31, 2024, 6:38 PM IST

డిజిటల్ విభజనను తగ్గించడం , యువకులను శక్తివంతం చేయడం కోసం ఒక ముఖ్యమైన చర్యలకు సంబంధించి దేశంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ boAt చొరవ తీసుకుంది.. ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం కంప్యూటర్ క్లాసెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు నమ్మ బెంగళూరు ఫౌండేషన్ (ఎన్‌బీఎఫ్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఇ‌నిషియేటివ్‌‌ కింద వెనుకబడిన విద్యార్ధులను అవసరమైన కంప్యూటర్ నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం, కొత్త అవకాశాలకు తలుపులు తెరిచి ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా బెంగళూరు రామమూర్తి నగర్‌లో కంప్యూటర్ ట్రైనింగ్ ఫెసిలిటీని ప్రారంభించింది. 

ఈ డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలతో యువకులను మరింత శక్తివంతం చేయడానికి రూపొందించిన‌ ప్రోగ్రామ్ ఇది. ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్ధులు ప్రాథమిక కంప్యూటర్ కార్యకలాపాలు, డిజిటల్ అక్షరాస్యత, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ల వంటి ముఖ్యమైన అంశాలను పరిశోధిస్తారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పరిజ్ఞానంపై మరింత జ్ఞానాన్ని పొందుతారు. 

జీవితాలను దృఢం చేయడానికి , మార్చడానికి సాంకేతికత బలాన్ని తాము విశ్వసిస్తున్నామని boAt సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ మెహతా అన్నారు. నమ్మ బెంగళూరు సహకారం ద్వారా తమ ఫౌండేషన్.. డిజిటల్ విభజనను అధిగమించడానికి , వారి పూర్తి సామర్ధ్యాన్ని వెలికి తీయడానికి అవసరమైన కంప్యూటర్ నైపుణ్యాలను పేద విద్యార్ధులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సమీర్ చెప్పారు. ఇది వారి అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యక్తిగత , వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త మార్గాలకు తలుపులు తెరుస్తుందని ఆయన ఆకాంక్షించారు. 

 

boAt sails into the future of education with Namma Bengaluru Foundation: Bridging the Digital Divide for Government School Students ksp

 

నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ట్రస్టీ సంజయ్ కె ప్రభు మాట్లాడుతూ.. ఈ ప్రభావంతమైన చర్యలో boAtతో కలిసి భాగస్వామి అయినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. కంప్యూటర్ క్లాసెస్ ప్రోగ్రామ్.. డిజిటల్ విభజనను తగ్గించడంలో , నేటి డిజిటల్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను మరింత శక్తివంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని ప్రభు ఆకాంక్షించారు. సాంకేతికత, విజ్ఞానానికి పెద్ద పీట వేయడంతో పాటు సమగ్ర విద్యను పెంపొందించడానికి, భవిష్యత్తు తరాలకు సాధికారత కల్పించడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని సంజయ్ అన్నారు. 

విభిన్న నేపథ్యాల విద్యార్ధులకు అందించడం కోసం బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ తరగతుల కార్యక్రమం అమలు చేయబడుతుంది. విలువైన అంశాలను సమకూర్చడం ద్వారా డిజిటల్ నైపుణ్యాలు, boAt, NBF అకడమిక్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఉన్నత విద్య, భవిష్యత్ కెరీర్‌లలో విజయం సాధించేందుకు వారిని సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. boAt , నమ్మ బెంగళూరు ఫౌండేషన్ కలిసి డిజిటల్ విభజనను తగ్గించి భవిష్యత్తు తరానికి సాధికారత కల్పించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం కంప్యూటర్ క్లాసెస్ ప్రోగ్రామ్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేయడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి అవసరమైన సాధనాలతో యువకులను సన్నద్ధం చేస్తామని హామీ ఇచ్చింది. 

బోట్ గురించి: 

boAt దేశంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్.     దాని ఆడియో వెరబుల్స్, మొబైల్ ఉపకరణాలు, స్మార్ట్ వేరబుల్స్, గేమింగ్ ఎక్విప్‌మెంట్‌లతో భారతీయ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇన్నోవేషన్ , కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్‌తో నడిచే boAt .. బలమైన కస్టమర్ కమ్యూనిటీని సృష్టించింది. 

నమ్మ బెంగళూరు ఫౌండేషన్ గురించి: 

బెంగళూరులోని నిరుపేద వర్గాల జీవితాలను మెరుగుపరచడానికి అంకితం చేయబడిన లాభాపేక్ష లేని సంస్థే ‘‘నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ’’. దీని ద్వారా పలు కార్యక్రమాలపై ఎన్‌బీఎఫ్ దృష్టి పెడుతోంది. అవసరమైన వారికి విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలను అందించడం, సామాజిక అభివృద్ధికి ఫౌండేషన్ తిరుగులేని నిబద్ధత నగరంలో లెక్కలేనన్ని జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios