మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు.

ఈ క్రమంలో సాంగ్లీ నగరం నుంచి వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా... పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మరణించగా.. పలువురు గల్లంతయ్యారు.

వీరిలో తొమ్మిది మందిని సహాయక బృందాలు రక్షించాయి..  ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 30 మంది వరద బాధితులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.