ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు, కంటైనర్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. వర్షాల కారణంగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై ఏర్పడ్డ గుంత వద్దే ఈ ప్రమాదం జరిగింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లుతున్న బీఎండబ్ల్యూ కారు.. వేగంగా వస్తున్న కంటైనర్‌లు ఢీకొన్నాయి. హాలియాపూర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో కారులోని నలుగురు స్పాట్‌లోనే మరణించారు. ఈ రెండు వాహనాలు చాలా వేగంతో ఉన్నాయి. ఎంత వేగం అంటే బీఎండబ్ల్యూ కారు ముందు భాగం ఆ కంటైనర్ కిందకు చొచ్చుకెళ్లిపోయింది. మరణించిన నలుగురిలో ఒకరి తల తెగిపోయినట్టు స్థానికులు కొందరు తెలిపారు. ప్రమాదం జరిగిన చోట ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు కుంగినట్టు కొందరు చెబుతున్నారు. వర్షాల వల్ల అక్కడ రోడ్డు పాడైపోయిందని, రిపేర్ వర్క్ జరుగుతున్నదని పేర్కొంటున్నారు. అయితే, సైడ్ రోడ్డు క్లోజ్ చేసి ఉండటం మూలంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు వివరిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం కారు వేగం సుమారు గంటకు 150 కిలోమీటర్లు ఉన్నదని చెబుతున్నారు. కంటైనర్ కూడా అతి వేగంగానే ఉన్నట్టు వివరిస్తున్నారు. సుల్తాన్ పూర్ వైపు నుంచి వస్తున్న బీఎండబ్ల్యూ కారు, లక్నో వైపు నుంచి వస్తున్న కంటైనర్‌లు ఢీకొన్నాయి.
Also Read: రహదారి పక్కన నిలబడ్డ ఎస్సైని ఢీ కొట్టిన ఆటో.. 30 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాలు..
ఈ ఘటన గురించి తెలియగానే అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కానీ, యాక్సిడెంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నది. కారులోని నలుగురూ చెల్లచెదురై పడిపోయినట్టు తెలుస్తున్నది.
పోలీసులు కేసు ఫైల్ చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు.
