హథ్రస్ దళిత యువతి అత్యాచారం కేసులో దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. గ్రామంలో తాత్కాళిక కార్యాలయం ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే పలుమార్లు బాధితురాలి కుటుంబసభ్యులను విచారించారు. 

కాగా.. తాజాగా నిందితుల కుటుంబసభ్యుల అధికారులను విచారించారు.  ఈ కేసుకు సంబంధించి ఆధారాల కోసం వారి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడు లవ్‌ కుశ్‌ సికార్వర్‌ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ వార్తల్ని నిందితుడి కుటుంబసభ్యులు ఖండించారు. లవ్‌ కుశ్‌ సోదరుడు రవి ఓ ఫ్యాక్టరీలో పెయింటర్‌గా పని చేస్తున్నాడని, అందుకే అతడి బట్టలు ఎర్ర పెయింట్‌తో మాసిపోయి ఉన్నాయని చెప్పారు. అది కేవలం ఎర్ర రంగు మాత్రమేనని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లుగా రక్తపు మరకలు కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిందితుడి సోదరుడు లలిత్‌ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశాడు.