అంతు చిక్కని వ్యాధితో అండమాన్ నికోబార్‌ దీవులకు చెందిన ఓ యువకుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఏడ్చినప్పుడు మనిషికి కన్నీరు రావడం సహజం.. కానీ ఇందుకు విరుద్ధంగా కన్నీటికి బదులు రక్తం రావడమే ఈ యువకుడి సమస్య.

దీనిని వైద్య పరిభాషలో ‘‘హీమోలాక్రియా’’ అంటారని వైద్యులు తెలిపారు. అయితే అతనిని పరీక్షించిన వైద్యులు ఆ కుర్రాడిలో హీమోలాక్రియా లక్షణాలు లేవని, దానితో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని ‘‘ అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’’ వైద్యులు నిర్థారించారు.

కానీ కంటి వెంట రక్తం కారడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. అయితే కళ్లకు సంబంధించిన సమస్యలు, తలకు గాయాలు, ముక్కు నుంచి రక్తం కారడం, రక్త సంబంధమైన వ్యాధులు వంటి సందర్భాల్లో కంటి నుంచి రక్తం కారే అవకాశాలు ఉన్నాయని ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్’’ పేర్కొంది.. కారణం ఏదైనప్పటికీ శరీరం లోపల అంతర్గతం ఉన్న సమస్యల వల్ల ఇలా జరిగేందుకు ఛాన్స్ ఉందని తెలిపింది.