Asianet News TeluguAsianet News Telugu

కోల్‌కత్తాలో భారీ పేలుడు: ఏడేళ్ల బాలుడుమృతి

పశ్చిమ బెంగాల్‌ బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. గాంధీజయంతి పర్వదినాన డమ్‌ డమ్‌లో ఈ పేలుడు సంభవించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మరణించగా, 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.  

blasts kolkata nagerbazar onedied
Author
Kolkata, First Published Oct 2, 2018, 5:43 PM IST

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. గాంధీజయంతి పర్వదినాన డమ్‌ డమ్‌లో ఈ పేలుడు సంభవించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మరణించగా, 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.  

వివరాల్లోకి వెళ్తే డమ్‌డమ్‌ సమీపంలోని నగర్‌బజార్‌లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో బాంబు పేలగానే దానిలోంచి గాజు పెంకులు, ఇనుప చువ్వలు దూసుకుని వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీ నిర్వహించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని జకే కౌర్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. 

 అయితే మార్కెట్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో దుండగులు పేలుడుకు కుట్రపన్నారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన డమ్‌ డమ్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ పంచూ రాయ్‌ పార్టీ కార్యాలయానికి సమీపంలో పేళుళ్లు సంభవించడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమను రాజకీయంగా ఎదుర్కొలేకనే గాంధీ జయంతి నాడు రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించాలిన బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని ఆరోపిస్తోంది. 

అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసిందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు లండన్‌ లాంటి నగరం అవసరంలేదని, బెంగాల్‌లోనే భద్రత కల్పిస్తే చాలని సీపీఎం నేతలు ఎద్దేవా చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios