ఎమ్మెల్యే నివాసం వద్ద పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంఘటన కర్ణాటక లోని బెంగళూరు సిటీ వ్యాలికావల్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రాజేశ్వరినగర్ ఎమ్మెల్యే మునిరత్నం నివాసం వెలుపల పేలుడు జరగడంతో ఒక వ్యక్తి మరణించాడు.

 సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేలుడుకు కారణాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం బెంగళూరులో ఈ ఘటన కలకలం రేపింది.