Blast at Punjab:  పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో రాత్రి 7:45 గంటలకు పేలుడు సంభవించినట్లు మొహాలి పోలీసులు సమాచారం అందించారు. ఎలాంటి నష్టం జరగలేదు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు. 

Blast at Punjab: పంజాబ్‌లోని మొహాలీ పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ భవనంలో సోమ‌వారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడి అద్దాలు, కిటికీలు పగిలి చిన్నపాటి ఆస్తి నష్టమైనట్టు సమాచారం. దీంతో సీనియర్‌ పోలీసు సుపరిడెంట్‌ ఆఫీసర్‌తో కూడిన బృందం కార్యాలయం పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. 

ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తును లక్ష్యంగా చేసుకుని రాకెట్ లాంచర్‌తో దాడి చేశార‌ని ఎస్పీ రవీంద్ర పాల్ సింగ్ ఒక ప్రకటన వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. అయితే ఈ దాడి ఉగ్రవాదులు చేశారా లేక కార్యాలయంలోని పేలుడు పదార్థాల వలన జరిగిందా అనేది తెలియాల్సి ఉంద‌ని మొహాలీ ఎస్పీ చెప్పారు. దానిపై విచారణ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. అదే సమయంలో, పేలుడు తర్వాత మొహాలీలో భద్రతా ఏర్పాట్లను పెంచిన‌ట్టు.. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.


ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఈ భవనం సెక్టార్‌ 77, SAS నగర్‌లోని సుహానా సాహిబ్ గురుద్వారా సమీపంలో ఉంటుంది. సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో జరిగిన రాకెట్‌ గ్రెనేడ్‌ దాడి వల్లే పేలుడు సంభవించిందని ఇంటెలిజెన్స్‌ వింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. భవనంలో మూడో అంత‌స్థు లక్ష్యంగా దాడి జరిగింది. పేలుడు జరిగిన తర్వాత భవనం చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. ఆ ప్రాంతమంతా పోలీసులు మోహరించారు. 

చండీగఢ్ ఎస్ఎస్పీ కుల్దీప్ చాహల్ ఇతర సీనియర్ అధికారులతో సంఘటనా స్థలంలో ఉన్నారు. ఘటనా స్థలం చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న‌ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ డీజీపీతో మాట్లాడి ఘటనపై పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులతో నిత్యం టచ్‌లో ఉంటున్న‌ట్టు కూడా చెబుతున్నారు. ఉగ్రదాడి జరిగే అవకాశం కూడా లేదని సోర్సెస్ తోసిపుచ్చింది. భవనంలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు వారు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పేలుడు వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. దీంతో పాటు ఫోరెన్సిక్ బృందాలను కూడా ఘ‌ట‌న స్థలం చేరుకుని ఆధారాల‌ను సేక‌రిస్తోంది. 

ఆదివారం నాడు రాష్ట్ర పోలీసులు సుమారు 1.5 కిలోల ఆర్‌డిఎక్స్‌తో నిండిన పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్న్ తరణ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదే సమయంలో, మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన పేలుడు గురించి విని షాక్ అయ్యాను అని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మన పోలీసులపై ఈ సిగ్గులేని దాడి చాలా ఆందోళన కలిగిస్తోంది. నేరస్తులను వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలని సీఎం భగవంత్ మాన్‌ని కోరుతున్నాను.