Asianet News TeluguAsianet News Telugu

లేహ్ హిల్ కౌన్సిల్ ఎన్నికలు: బీజేపీ ఘన విజయం

లేహ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించింది.
 అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లోని 26 స్థానాల్లో 15 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించింది.

BJPs victory in Ladakh Autonomous Hill Development Council election historic: JP Nadda lns
Author
New Delhi, First Published Oct 26, 2020, 8:33 PM IST

శ్రీనగర్: లేహ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించింది. అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లోని 26 స్థానాల్లో 15 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించింది.

ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లలో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 9 సీట్లను గెలుచుకొంది. ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 

 

లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.లేహ్ ఎంపీ జమ్యాంగ్ తీర్ధాంగ్ నంగ్యాల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో 89,776 మంది ఓటర్లో 65 శాతం మంది ఈ నెల 22న తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. జిల్లాలోని 26 నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. 294 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios