Karnataka Congress: బీజేపీ అవినీతి పాలన ముగిసింద‌ని పేర్కొంటూ కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలు గోమూత్రంతో రాష్ట్ర విధాన సౌధను శుద్ధి చేశారు. సిద్ధరామయ్య శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధానసౌధ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. బీజేపీ తన అవినీతితో అసెంబ్లీని కలుషితం చేసిందని ఆ పార్టీ ఆరోపించింది. 

Congress workers pour cow urine at K'taka Vidhana Soudha : రాష్ట్రంలో అవినీతి బీజేపీ పాలన ముగిసింద‌ని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం క‌ర్నాట‌క‌ విధానసౌధ ఆవరణను గోమూత్రంతో శుభ్రపరిచారు. మే 20న ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఏడాది జనవరిలో విధాన సౌధ (అసెంబ్లీ)ను గోమూత్రంతో ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. మే 13న ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మే 13న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 135 స్థానాలను గెలుచుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవ‌ల క‌ర్నాట‌క అసెంబ్లీ జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజ‌యం సాధించింది. అధికార పీఠం ద‌క్కించుకుంది. కాంగ్రెస్ ఘనవిజయం సాధించి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవినీతి బీజేపీ పాలన ముగిసింద‌ని పేర్కొంటూ రాష్ట్ర విధానసౌధ ఆవరణను గోమూత్రంతో శుభ్రపరిచారు. మే 20న ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ ఏడాది జనవరిలో విధాన సౌధ (అసెంబ్లీ)ను గోమూత్రంతో ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…

"విధాన సౌధను శుభ్రపరచడానికి మేము కొంత డెటాల్ తో వస్తాము. శుద్ధి కోసం నా దగ్గర కొంత గోమూత్రం కూడా ఉంది..' అని శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీ పాలనలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపించారు. సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలు శనివారం కర్ణాటకలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 24 మంది మంత్రులను పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. 

Scroll to load tweet…