ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ గురువారం కీలక భేటీ కానుంది. సాయంత్రం ఏడున్నరకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ గురువారం కీలక భేటీ కానుంది. సాయంత్రం ఏడున్నరకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది.
అభ్యర్ధుల జాబితాతో పాటు పొత్తులు, సీట్ల పంపకాలపై ఈ సమావేశంలో చర్చించున్నారు. మరోవైపు సీఈసీ భేటికి ముందు హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌పై ఫోకస్ పెట్టిన బీజేపీ దూకుడు పెంచింది. మొదటి, రెండో విడతల కోసం అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేసింది. ప్రతి స్థానానికి ముగ్గురు అభ్యర్ధుల చొప్పున లిస్ట్ రెడీ చేసింది.
దీనిని ఇప్పటికే పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేశారు బెంగాల్ బీజేపీ నేతలు. బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీలో తుది జాబితాను ఖరారు చేయనున్నారు. బెంగాల్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీజేపీ.
అభ్యర్ధులను ముందుగా ప్రకటించి, ప్రచారంలో జోరు పెంచాలని భావిస్తోంది. ముందుగా దాదాపు 60 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన సువేందు అధికారి మమతపై పోటీకి సై అంటున్నారు. నందిగ్రామ్‌లో పోటీ చేస్తానని చెబుతున్నారు. మమతా బెనర్జీ మార్చి 11న నందిగ్రామ్‌లో నామినేషన్ వేయనున్నారు.
