Asianet News TeluguAsianet News Telugu

నిర్మలాసీతారామన్ తో పనిచేసిన రోజులు గుర్తు చేసుకున్న అనురాగ్ ఠాకూర్..

ప్రస్తుతం సమాచార, ప్రసార, క్రీడా మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూస్తున్న అనురాగ్ ఠాకూర్ అంతకు ముందు నిర్మలా సీతారామన్ దగ్గర జూనియర్ మంత్రిగా పనిచేశారు. పదోన్నతి తరువాత ఆయన మొదటిసారి సీతారామన్ ను కలిశారు. 

BJPs Anurag Thakur Shares "Memories" With Nirmala Sitharaman - bsb
Author
Hyderabad, First Published Jul 29, 2021, 9:33 AM IST

న్యూ ఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈ రోజు సభలో తీసుకున్న కీలక నిర్ణయాల మీద విలేకరుల సమావేశానికి  ఆమెతో కలిసి వెడుతున్న సందర్భంలో
ఆయన పాత విషయాలు జ్ఞాపకం చేసుకున్నారు.

ప్రస్తుతం సమాచార, ప్రసార, క్రీడా మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూస్తున్న అనురాగ్ ఠాకూర్ అంతకు ముందు నిర్మలా సీతారామన్ దగ్గర జూనియర్ మంత్రిగా పనిచేశారు. పదోన్నతి తరువాత ఆయన మొదటిసారి సీతారామన్ ను కలిశారు. ఈ సందర్భంగా పాత రోజులను జ్ అనురాగ్ ఠాకూర్‌తో అతను మంత్రి గా ప్రమోట్ అయిన తరువాత మొదటిసారి కలిశారు. ఈ సందర్భంగా ఆయన పాత రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. క్యాబినెట్ రీ షెఫిల్ లో భాగంగా అనురాగ్ మంత్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 

జూలై 7న జరిగిన మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌ను క్యాబినెట్ ర్యాంకును ఇచ్చి.. సమాచార, ప్రసార, క్రీడా మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించారు. అనురాగ్ తామిద్దరూ న్యూస్ బ్రీఫింగ్ చేస్తూ సభకు వస్తున్న ఫొటోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు. 

"ఈరోజు విలేకరుల సమావేశంలో కేబినెట్ అనౌన్స్ మెంట్ల గురించి  గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీతో చర్చ జరిగింది. మేమిద్దరం కలిసి చేసిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ అనౌన్స్ మెంట్  సందర్భాన్ని ఈ సమయంలో గుర్తుచేసుకున్నాం" అని ఠాకూర్ #memories హ్యాష్‌ట్యాగ్‌తో చెప్పుకొచ్చారు. 

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నిర్మల సీతారామన్, ఠాకూర్ లు కలిసి ఆత్మమీర్భార్ భారత్ ఆర్థిక సహాయ ప్యాకేజీలో భాగంగా నిర్ణయాలు ప్రకటించారు.

ఇద్దరూ మీడియాను ఉద్దేశించి, ఎంఎస్ సీతారామన్ ఇంగ్లీషులో ఈ ప్రకటన చేయగా, మిస్టర్ ఠాకూర్ హిందీలో దాన్ని తర్జుమా చేశారు. వారిద్దరిని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ప్రశ్నలతో ముంచెత్తగా.. వారు వాటన్నింటినీ ఓపికగా సమాధానాలిచ్చారు.

ఆర్‌బిఐ బ్యాంకులపై మారటోరియం విధించినట్లయితే 90 రోజుల్లోపు బ్యాంకు డిపాజిటర్లు తమ డిపాజిట్లపై రూ. 5 లక్షల బీమా పొందుతారని  సీతారామన్ ఈ రోజు ప్రకటించారు. ప్రతిపాదిత చట్టం అన్ని బ్యాంక్ డిపాజిట్లకు భీమాను అందిస్తుంది. వాణిజ్య బ్యాంకులు, దేశంలోని విదేశీ శాఖలను కూడా కవర్ చేస్తుందని సీతారామన్ విలేకరులతో అన్నారు.

క్యాబినెట్ పునర్వవ్యస్థీకరణలో ఎక్కువ లాభపడిన పొందిన వారిలో ఠాకూర్ ఒకరు. 2019 లో రెండవసారి అధికారం చేపట్టినప్ప తరువాత.. నరేంద్రమోడీ తన క్యాబినేట్ ను మొదటిసారి విస్తరించారు.  దీంట్లో కేబినెట్ ర్యాంకుకు పదోన్నతి పొందిన ఏడుగురు రాష్ట్ర మంత్రులలో ఆయన కూడా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios