కర్ణాటకలో బీజేపీ యువ మోర్చా నేతను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. బైక్ పై వచ్చిన దుండగులు యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారును కొడవలితో నరికి చంపారు. దక్షిణ కన్నడ జిల్లా సులియా పట్టణంలో ఈ ఘటన జరిగింది.

బెంగళూరు: కర్ణాటకలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన బీజేపీ యూత్ వింగ్ నేత ఒకరిని కొడవిలితో నరికి చంపారు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువ మోర్చా కార్యదర్శి ప్రవీణ్ నెట్టారును సులియా పట్టణంలో హత్యగావించారు.

ప్రవీణ్ నెట్టారుకు బల్లారీ ఏరియాలో ఓ పౌల్ట్రీ షాప్ ఉన్నది. రాత్రి ఆ షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి బయల్దేరిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆయన ఇంటికి వెళ్లుతుండగా కొందరు దుండగులు బైక్‌పై వచ్చి అతన్ని అటకాయించినట్టు పోలీసులు వివరించారు. అనంతరం, కొడవలితో నరికి చంపేసినట్టు తెలిపారు. అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

కర్ణాటక లో 2018లో ప్రతిపక్ష బిజెపి పార్టీకి చెందిన ఓ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిక్‌మగళూరు బిజెపి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అన్వర్ ను కొందరు దుండగులు కత్తలతో దారుణంగా నరికి హత్య చూశారు. ఈ హత్య రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.