JP Nadda: గతేడాది జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. కానీ, కరోనా సెకండ్ వేవ్ తమ ప్రచారాన్ని ప్రభావితం చేసిందనీ, లేకపోతే.. పశ్చిమ బెంగాల్ లో పార్టీ అధికారంలోకి వచ్చేదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటాన్ని కొనసాగించి టీఎంసీని ఓడించాలని జేపీ నడ్డా అన్నారు.
JP Nadda: గతేడాది జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేదనీ, కానీ, కరోనా సెకండ్ వేవ్ తమ ప్రచారాన్ని ప్రభావితం చేసిందనీ, పశ్చిమ బెంగాల్ లో పార్టీ అధికారంలోకి వచ్చేదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా అన్నారు. గురువారం పార్టీ నిర్వహించిన ఓ సదస్సు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చేరువవుతూ.. బెంగాలీల గౌరవాన్ని నిలబెట్టడానికి, రాష్ట్ర ప్రజలను కించపరచడానికి ప్రయత్నించేవారిని బహిర్గతం చేయడానికి పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నడ్డా అన్నారు.
గత ఎన్నికల ప్రచారంలో ప్రజా స్పందన చూస్తే.. అధికారంలోకి వస్తామని చాలా స్పష్టంగా ఉండే.. కానీ నాలుగో దశ పోలింగ్ తర్వాత కోవిడ్ 19 సెంకడ్ వేవ్ ప్రారంభం కావడంతో తమ ప్రచారాన్ని విరమించుకోవలసి వచ్చిందని నడ్డా అన్నారు.
నాల్గవ దశ పోలింగ్ అనంతరం.. ప్రచారం లేకుండానే మిగిలిన దశల ఎన్నికలు జరిగాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని, బ్రిగేడ్ పరేడ్ మైదానంలో (కోల్‌కతాలోని) విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తామని విశ్వసిస్తున్నామని అన్నారు.
ఇక్కడి ప్రజలు అక్రమాస్తుల ఆరోపణలు, కుంభకోణాలతో విసిగిపోయారని, ప్రజలు రాష్ట్రంలో మార్పు కోసం వేచిచూస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. భారతదేశం సజీవ సమాజమని, అది సరైన సమయంలో స్పందించి, ప్రత్యుత్తరమిస్తుందని, ప్రజాస్వామ్యయుతంగా మన పోరాటాన్ని కొనసాగించాలని, టీఎంసీని ఓడించాలని అన్నారు.
గత ఎన్నికల్లో TMCని ఓడించడంలో బీజేపీ విఫలమైంది. 294 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ కేవలం 77 సీట్లు గెలుచుకోగలిగింది. మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి రాష్ట్ర భాజపాలో అంతర్గత పోరు, వలసలు ప్రారంభం అయ్యాయి. ఫలితాల ప్రకటన అనంతరం పార్టీలోని పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు.
అందులో మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, పార్టీ ఎంపీ అర్జున్ సింగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ సహా ఐదుగురు శాసనసభ్యులు గత ఏడాది మేలోTMCలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద వంటి జాతీయవాదుల వారసత్వాన్ని పొందేందుకు అధికార TMC, BJP లు రెండూ ప్రయత్నించాయి.
బెంగాలీల గౌరవాన్ని నిలబెట్టడానికి నిజమైన పోరాటం పేద ప్రజల హక్కుల కోసం పోరాడడం, "సిండికేట్, తోలాబాజ్ (దోపిడీదారు) పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 'సిండికేట్' అనేది వ్యాపారవేత్తల సమూహాన్ని సూచిస్తుంది. అందులో ప్రమోటర్లు, కాంట్రాక్టర్‌లను అధిక ధరలకు తక్కువ నాణ్యతతో కూడిన నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేయమని ఆరోపించారు.
